Chandrababu: చంద్రబాబు ఆరాటం పొత్తుల కోసం కాదా?
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2018 వరకు ఎన్డీఏలో కొనసాగిన ఆయన.. తరువాత బయటకు వచ్చేశారు.గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు.వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చింది.

Chandrababu: చంద్రబాబుపై ఆర్థిక నేరాలు ఉన్నాయా? అందుకే ఆయన జూన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిశారా? కేవలం కేసుల నుంచి తప్పించుకునేందుకే బిజెపి పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారా?ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు అక్రమ సంపాదన వందలాది కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ 153 సి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2018 వరకు ఎన్డీఏలో కొనసాగిన ఆయన.. తరువాత బయటకు వచ్చేశారు.గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు.వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చింది.చంద్రబాబు హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పునః సమీక్షించింది. ఈ తరుణంలో షాపురజి పల్లంజి కంపెనీ 2017 నుంచి 2019 వరకు టిడిపి హయాంలో కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది. ఆ కంపెనీకి చెందిన మనోజ్ వాసుదేవ్ పార్థసానితప్పుడు ఎన్వాయిస్లను సృష్టించి భారీగా నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తుతాయి. ఈ తరుణంలో ఆయన ఇంట్లో సోదాలు చేయగా కీలక డాక్యుమెంట్లు బయటపడ్డాయి.
ఈ క్రమంలో చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ పేరు బయట పడింది. టిడిపి ప్రభుత్వ హయాంలో తీసుకున్న కాంట్రాక్టులు, వాటి ద్వారా పొందిన ఆయాచిత లబ్ధి, డబ్బు చేతులు మారడం వంటి వాటిని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. దాదాపు 110 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు స్వయంగా చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ ఆదాయ పన్ను శాఖకు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు దీనిపై సమాధానమిచ్చినా ఆర్థిక శాఖఅభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ తరుణంలోనే చంద్రబాబుతరచూ కేంద్ర పెద్దలను కలుసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైకి పొత్తుల వ్యవహారం అంటూ చెబుతున్నా.. లోపాయి కారిగా అమిత్ షా తో చర్చించింది తనకు వచ్చిన నోటీసుల గురించేనని కొత్తగా టాక్ నడుస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి మరి.
