APTA 15th Anniversary : అమెరికాలో ఘనంగా ఆప్త 15వ వార్షికోత్సవం

అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య & సత్య తోట తదితురులని సత్కరించారు.

  • Written By: NARESH ENNAM
  • Published On:
APTA  15th Anniversary : అమెరికాలో ఘనంగా ఆప్త 15వ వార్షికోత్సవం

APTA 15th Anniversary : ఆప్త 15వ వార్షికోత్సవ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్, అట్లాంటా మహా నగరంలో వైభవంగా ఆరంభమయ్యాయి.

ఈ వేడుకలకి దేశ విదేశాల నుంచి తెలుగు వారు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు హాజరై పాలు పంచుకున్నారు.

APTA's 15th Anniversary (5)

APTA’s 15th Anniversary (5)

అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి, సూర్య & సత్య తోట తదితురులని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ హీరోయిన్ సమంత ప్రభు , సాయి ధర్మతేజ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చివరిగా రఘు కుంచె తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు బొత్స సత్యనారాయణ, బండి సంజయ్, హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బంద్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర , సంగీత విధ్వాంసులు – కోటి, రఘు కుంచె, లిరిసిస్ట్- అనంత్ శ్రీరామ్ లు పాల్గొని సందడి చేశారు.

మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో కన్నుల పండువగా మొదలయ్యాయి.

Read Today's Latest Festive glory News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు