APTA 15Th Anniversary : వివిధ రంగాల ప్రముఖులకు ‘ఆప్త’ పురస్కారాలు
మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగగా ముగిశాయి

APTA 15th Anniversary : అమెరికాలోని అట్లాంటాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా మూడో రోజు కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి. వివిధ కార్యక్రమాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామివేత్త ప్రముఖులు పాల్గొన్నారు.
మొట్టమొదటి సారిగా ఆప్త లో ప్రవేశపెట్టిన ఆప్త పురస్కారాల కార్యక్రమం అత్యంత వైభవం గా జరిగాయి. ప్రెసిడెంట్స్ క్లబ్ ((2008 నుంచి 2023 వరకు పని చేసిన ప్రెసిడెంట్స్) ఎంపిక చేసిన ప్రతిభావంతమైన వ్యక్తులకి ఈ పురస్కారాలు అందచేశారు.
ఆప్త జీవిత సాఫల్య పురస్కారం – సుబు కోట
ఆప్త పరమ విశిష్ట విశ్వ సేవా పురస్కారం – సంకురాత్రి చంద్ర శేఖర్ గారికి
ఆప్త విశిష్ట విశ్వ సేవా పురస్కారం – రంగిశెట్టి మంగ బాబు గారికి, శ్రీహరి కోటెల గారికి
ఆప్త సేవా పురస్కారం – 2019-20 కి శ్రీధర్ నిశశంకరరావ్ గారికి
ఆప్త సేవా పురస్కారం – 2021-22 కి అనిల్ వీరిశెట్టి గారికి
ఆప్త సేవా పురస్కారం – 2023 కి రవి ఎలిశెట్టి గారికి
ఆప్త నాయకత్వ పురస్కారం ప్రసాద్ సమ్మెట గారికి ప్రదానం చేశారు.
మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగగా ముగిశాయి
