Ganta Srinivasa Rao: గంటా రాజీనామాకు ఆమోదం..సీఎం జగన్ యాక్షన్ ప్లాన్
Ganta Srinivasa Rao: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభావానికి అదే కరెక్ట్ మందుగా జగన్ భావిస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టెక్కడానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. దీనిని ఆమోదించి మొత్తం సమస్యలకు చెక్ చెప్పాలని జగన్ […]


Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రాబోతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభావానికి అదే కరెక్ట్ మందుగా జగన్ భావిస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టెక్కడానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది. దీనిని ఆమోదించి మొత్తం సమస్యలకు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో టీడీపీ మంచి ఊపు మీద ఉంది. అటు విపక్షాల్లో సైతం ఐక్యత కనిపిస్తోంది. ఈ సమయంలో రిస్క్ చేయడం అవసరమా అన్న ప్రశ్న కూడా అధికార పార్టీలో తలెత్తుతోంది. అయితే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు వచ్చింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను చేజార్చుకున్న జగన్ సర్కారు మరో ఎన్నికకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి. అయితే ఏడు స్థానాలు పొందడం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. అటు ధిక్కార ఎమ్మెల్యేలు ఒక వైపు, అటు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తున్నఎమ్మెల్యేలు ఎవరో తెలియక తలలు పట్టుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో చెప్పేందుకు వైసీపీ మాక్ పోలింగ్ నిర్వహించింది. ఇలా చేసిన రెండుసార్లు ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పుడుగా ఓటువేశారు. దీంతో ఇవి ఇన్ వాలిడ్ కింద వస్తాయి. పార్టీ విప్ ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా ఇన్ వాలిడ్ వేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలతో డిలాపడిన శ్రేణులకు ధైర్యం ఇవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి.
ఇటువంటి సమయంలో గంటా శ్రీనివాసరావు రాజీనామా అధికార పార్టీకి అస్త్రంగా మారింది. టీడీపీ కి ఎలా ఓట్లు తగ్గించాలన్న దానిపై ఇప్పుడు వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ పెండింగ్‌లో ఉంది . చాలా కాలంగా ఆమోదించలేదు. ఇప్పుడు ఆమోదించినట్లుగా నోటిఫికేషన్ ఇస్తే.. ఆయన ఓటు హక్కు కోల్పోతారు. అదే జరిగితే టీడీపీకి ఓ ఓటు తగ్గిపోతుంది. వైసీపీ సభ్యులకు మరింత అడ్వాంటేజ్ వస్తుంది. అయితే ఇది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. అసలే ఉత్తరాంధ్రలో టీడీపీ ఎమ్మెల్సీ భారీ ఆధిక్యతతో గెలుపొందారు. పట్టభద్రులు, విద్యావంతులు సైలెంట్ గా ఓటు వేశారు. భారీ ఆధిక్యతను ఇచ్చారు.

Ganta Srinivasa Rao
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామన్నా అక్కడి ప్రజలు పెద్దగా ఆహ్వానించలేదు. దీనినే అజెండాగా తీసుకొని వైసీపీ నేతలు ప్రచారం చేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇటువంటి సమయంలో ఉప ఎన్నికకు వెళ్లడం అంటే సాహసంతో కూడుకున్న పనే. పైగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వాటి మధ్య పొత్తు కుదరకున్నా అందరి ఫోకస్ వైసీపీ ఓటమిపై నే ఉంది. అందుకే అందరూ టీడీపీ అభ్యర్థికే ఓటువేసే అవకాశముంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, ఇటు విపక్షాల బలం తోడైతే టీడీపీ అభ్యర్థి ఏకపక్ష విజయం సాధించే చాన్స్ ఉంది. అదే జరిగితే ఎన్నికల ముంగిట అధికార పార్టీకి చావుదెబ్బ తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి సాధారణ ఎన్నికలను పణంగా పెట్టేంత అమాయకుడు జగన్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.