
అసెంబ్లీలో చెప్పిన నివర్ తుఫాను నష్టాలకు.. క్యాబినెట్ లెక్కలకీ పొంతన లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. మద్యం ఆదాయం వదులుకోలేని ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులకు తమ పార్టీ నేత పవన్ కోరిన పరిహారం హేతుబద్ధమైనదేనని చెప్పారు. అధికారంలోకి వస్తే సీఎం జగన్ రైతు ప్రభుత్వాన్ని, సంక్షేమ పాలనను అందిస్తామన్నారని, ఇవాళ హెలికాప్టర్ పర్యటనలకే పరిమితమవ్వడం విడ్డూరంగా ఉందని తప్పుబట్టారు. మంత్రులు కాకిలెక్కలు చెబుతూ ప్రజలు, రైతులను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.