
సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్, చంద్రబాబు రాయలసీమ మోసగాళ్లని వీర్రాజు ధ్వజమెత్తారు. రాయలసీమ అభివృద్ధి జగన్‌కు ఇష్టం లేదన్నారు. రాయలసీమ ప్రజలు సెకండ్ గ్రేడ్ సిటిజన్లలా కనిపిస్తున్నారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాయలసీమ ప్రజల్లో దమ్ము లేదనుకుంటున్నారని, బీజేపీ ద్వారా చూపించాలని చెప్పారు. బీజేపీకి అధికారం ఇవ్వండి.. రాయలసీమను రతనాల సీమ చేస్తామని ప్రకటించారు. రాయలసీమ అభివృద్ధిపై జగన్, చంద్రబాబు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అమరావతి కోసం ఉద్యమించే అర్హత చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. అమరావతిని నిర్మించే ఉంటే జగన్ రాజధానిని తరలించేవారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.