
అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం.. టీటీడీ ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్టర్లో మండిపడ్డారు. దూరం నుంచి వచ్చిన భక్తులను కొండపైకి అనుమతించకపోగా.. లాఠీఛార్జి చేయడం హేయమని ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు.. కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ.. డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నట్లు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి.. శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని చంద్రబాబు కోరారు.