Site icon OkTelugu

ఏపీలో కొత్తగా 1,301 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,301 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 8,65,705 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 6,970గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 8,46,120 మంది కోలుకోగా ప్రస్తుతం 12,615 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 67,269 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా కేసులు పెరిగాయి. పట్టణాలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో జాగ్రత్తలుపాటించాల్సిందేనని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Exit mobile version