Pawan Kalyan: పవన్ కు కలిసొస్తున్న కాలం.. కింగా? కింగ్ మేకరా?
సాధారణంగా రాజకీయ, సినీ రంగాల్లో ఉన్న వారికి జాతకాలపై అపార నమ్మకం ఉంటుంది. చాలామంది సినీ,రాజకీయ ప్రముఖులకు జాతకాలు చెప్పి ఫేమస్ అవుతుంటారు.

Pawan Kalyan: పవన్ సినీ, రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో బిజీగా మారారు. 2024 ఎన్నికల్లో పవన్ కింగ్ మేకర్ గా మారడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థానాలు సాధించి ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించ బోతున్నారని సంకేతాలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పవన్ వ్యవహార శైలి ఉంది. పొత్తులతో ముందుకు వెళ్లడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టుపై పవన్ స్పందించారు.బాలకృష్ణ,లోకేష్ లతో కలిసి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు. అటు చంద్రబాబు కుటుంబ సభ్యులను సైతం పరామర్శించి ధైర్యం చెప్పారు. నేరుగా ప్రెస్ మీట్ పెట్టి టిడిపి, జనసేన ఎన్నికల్లో కలిసి వెళ్తాయని ప్రకటించారు. కష్టంలో ఉన్న స్నేహితుడిని కలిసి మరి తాను అండగా ఉంటానని చెప్పడం పవన్ గొప్పతనాన్ని తెలియజేసింది. అదే సమయంలో పవన్ పక్కా వ్యూహంతోనే అడుగులు వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతటి కష్టకాలంలో తమకు అండగా నిలిచిన పవన్ పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత సానుకూలత ఏర్పడింది. పవన్ అడిగినన్ని సీట్లతో పాటు పవర్ షేరింగ్ ఇచ్చేందుకు సైతం టిడిపి సానుకూలత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సానుకూల పరిణామాలకు పవన్ జాతకమే కారణమని.. వచ్చే ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్ గా మారడం ఖాయమని కొన్ని రకాల విశ్లేషణలు తాజాగా వెలువడుతున్నాయి.
సాధారణంగా రాజకీయ, సినీ రంగాల్లో ఉన్న వారికి జాతకాలపై అపార నమ్మకం ఉంటుంది. చాలామంది సినీ,రాజకీయ ప్రముఖులకు జాతకాలు చెప్పి ఫేమస్ అవుతుంటారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేతికి రెండు ఉంగరాలు కనిపించడం అరుదైన అంశం. ఆయన చేతికి ఉంగరాల్లో ఒకటి నాగబంధం, రెండోది కూర్మమని తెలుస్తోంది. పవన్ సెంటిమెంట్ దృష్ట్యా వాటిని ధరించారని టాక్ నడుస్తోంది. ఈ రెండు ప్రత్యేక ఉంగరాలు రాజకీయంగా అనుకూల ఫలితాలని ఇస్తాయని సమాచారం. అందుకే వీటిని పవన్ ధరించారని కొందరు భావిస్తున్నారు.
అయితే ముఖ్యంగా జాతకరీత్యా తాబేలు ఉంగరాన్ని ధరిస్తే అధికార యోగంతో పాటు ధనయోగం లభిస్తుందని జాతక నిపుణులు చెబుతుంటారు. ఇది చేతిలో ఉంటే విజయాలు తమవంటే ఉంటాయని ఎక్కువ మంది నమ్మకం. ప్రస్తుతం పవన్ వేళ్ళలో ఇవి కనిపిస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో పవన్ కు అద్భుత విజయం దక్కనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2024 ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎలా చూసినా పవన్ కు రాబోయేవి మంచి రోజులేనని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
