ఏపీలో స్థానిక సమరంకు రంగం సిద్ధం!
ఆంధ్ర ప్రదేశ్ లో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైనది. ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఎంపిటిసి, జడ్‌పిటిసిలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దీని ప్రకారం నేటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమై నెలాఖరుకు పూర్తి అవుతుంది. ఎంపిటిసి. జడ్‌పిటిసిలకు రెండు దశల్లో ఈ నెల 21, 24 తేదీల్లో పోలింగ్ జరగనుంది. తొలివిడత ఎన్నికలు జరగనున్న ఎంపిటిసి, […]

ఆంధ్ర ప్రదేశ్ లో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైనది. ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. ఎంపిటిసి, జడ్‌పిటిసిలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దీని ప్రకారం నేటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభమై నెలాఖరుకు పూర్తి అవుతుంది.
ఎంపిటిసి. జడ్‌పిటిసిలకు రెండు దశల్లో ఈ నెల 21, 24 తేదీల్లో పోలింగ్ జరగనుంది. తొలివిడత ఎన్నికలు జరగనున్న ఎంపిటిసి, జడ్‌పిటిసిలకు నేడు (ఏడవ తేది) రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. 9న రిటర్నింగ్ ఆఫీసర్ స్థానికంగా నోటీసు జారీ చేస్తారు. ఆ రోజు నుండే నామినేషన్లు ప్రారంభమవుతాయి.
మలివిడత ఎన్నికలకు 10వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఆర్‌ఓ 12వ తేది నోటీసు జారీచేస్తారు. ఆ స్థానాలకు ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, స్థానికంగా 15వ తేది జారీ అవుతుంది. ఆ తేది నుండి మున్సిపాల్టీల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 27వ తేది మున్సిపల్ పోలింగ్ జరుగుతుంది.
ఎంపిటిసి, జడ్‌పిటిసిలతో పాటు మున్సిపాల్టీల ఎన్నికల ఫలితాలను ఈ నెల 29న ప్రకటించనున్నారు.
మరోవైపు జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషనను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ రాజ్‌శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మొత్తం 13 జిల్లా పరిషత్‌లలో ఎస్‌టి మహిళకు 1, ఎస్‌సి మహిళకు 1, బిసి మహిళకు 2, ఎస్సీలకు 1, బిసిలకు 1 జిల్లా పరిషత్ స్థానాలను రిజర్వు చేశారు. జనరల్ సీట్లలో మూడింటిని మహిళలకు కేటాయించారు. ఇవి పోను నాలుగు స్థానాలను జనరల్‌గా గుర్తించారు.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరగనుండటంతో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. శుక్రవారం జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ ఈ విషయం తెలిపారు. పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలిపిందని, దానికి తాము అంగీకరించామని ఆయన చెప్పారు.