AP CM YS Jagan Vs Chandababu Naidu : చంద్రబాబుది నయా అంటరానితనం.. జగన్ ఫైర్

క్కడ పోర్టు ఏర్పాటు కాకుంటే.. అమరావతిలో తన బినామీగా పెట్టుకున్న భూములను విపరీతమైన ధరలకు అమ్ముకోవచ్చని తీరని ద్రోహానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బందరు పోర్టుతో కృష్ణా జిల్లా రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు. 

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 04:32 PM IST

AP CM YS Jagan Vs Chandababu Naidu : ఏపీ సీఎం జగన్ మరోసారి ఫైరయ్యారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు .రూపం మార్చుకున్న అంటరానితనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు సీఎం జగన్. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తుంటే.. ఈ పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోలుస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని అన్నారు.

గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ గుర్తుచేశారు. పేదవారంటే చంద్రబాబుకు చులకనభావమన్నారు.  ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు అనలేదా? అని ప్రశ్నించారు.  బీసీల తోకలు కత్తిరించాలని చేసిన కామెంట్స్ ను కూడా గుర్తుచేశారు. మూడు రాజధానులు వద్దంటూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.  మూడు ప్రాంతాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనే కోర్టులో కేసులు వేశాడని కూడా ఆరోపించారు. అన్నికులాల ప్రజలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. 50 వేల మంది ఇళ్ల స్థలాలు ఇస్తామంటే చంద్రబాబుతో పాటు రాక్షస ముఠా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

బందరు పోర్టు నిర్మాణానికి గతంలో అనేక అడ్డంకులు వచ్చాయని గుర్తు చేశారు. పోర్టు ఇక్కడ రాకూడదని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 22 గ్రామాలు తీసుకోవాలని, 33వేల ఎకరాలు తీసుకోవాలని నోటిఫై చేసి.. రైతులు భూములను అమ్ముకునే స్వేచ్ఛలేకుండా చంద్రబాబు చేశారని ధ్వజమెత్తారు . ఇలా చేస్తే పోర్టు అడగరని చంద్రబాబు ప్లాన్ వేశారని, కానీ, చివరకు ప్రజలే విజయం సాధించారని చెప్పుకొచ్చారు. ఇక్కడ పోర్టు ఏర్పాటు కాకుంటే.. అమరావతిలో తన బినామీగా పెట్టుకున్న భూములను విపరీతమైన ధరలకు అమ్ముకోవచ్చని తీరని ద్రోహానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బందరు పోర్టుతో కృష్ణా జిల్లా రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్ ప్రకటించారు.