విశాఖకు రాజధానిని ఉగాదికే తరలింపు!

  • Written By:
  • Publish Date - February 20, 2020 / 04:09 PM IST


అమరావతి నుండి విశాఖకు రాజధానిని ఉగాదికే తరలించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉగాది రోజున నిర్ణయించిన ముహర్తానికి కొన్ని శాఖలను తరలించి. ఆ తరువాత దశలవారిగా మిగిలిన శాఖలను విశాఖకు మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిసింది.

‘ఉగాదికి వెళ్ళాలని ఎప్పుడో అనుకున్నాం. అలాగే వెళ్లాలని భావిస్తున్నాం.’ అని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పేర్కొనడం గమనార్హం. సంక్రాంత్రి తర్వాతే ఈ పక్రియ ప్రారంభించాలని తొలుత అనుకున్నప్పటికీ న్యాయస్థానంలో ఇబ్బందులు తలెత్తడంతో వెనుకడుగు వేయవలసి వచ్చింది.

ప్రసతుతం రాష్ట్ర హై కోర్ట్ లో దీనిపై వాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే తరలింపుపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఉగాదికి కొన్ని శాఖలను విశాఖకు తరలించనున్నారు. మరోవైపు ప్రస్తుతం అమరావతిలో నిర్మాణంలో ఉన్న కట్టడాలను పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలను పూర్తిచేసి, వారికి అమరావతిలోనే వసతి కల్పించాలని నిర్ణయించారు. మంత్రులకు సంబంధించినంత వరకు విశాఖలో కూడా వసతి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సచివాలయం విశాఖలో ఉండటంతో మంత్రులకు శాశ్వత నివాసాలు విశాఖలోనే ఉండే అవకాశం ఉంది.

అదే సమయంలో ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు అమరావతిలో ఇచ్చిన స్థలాలను వెనుకకు తీసుకుని, వారికి విశాఖలో కొత్తగా స్థలాలను ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసిరది. ప్రతి అధికారి అమరావతిలో స్థలానికి పాతిక రూ 25 లక్షల చొప్పున చెల్లించి స్థలాలను రిజిస్టర్‌ చేయించుకున్నారు. దీరతో ఆ స్థలాలను ప్రభుత్వం పేరిట మళ్లీ బదలాయించుకుని, విశాఖలో అదే మొత్తానికి కొత్తగా స్థలాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.