Anushka Shetty Marriage: స్టార్ నిర్మాతతో అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెడుతారు.

అనుష్క పెళ్లి టాపిక్ ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న అంశం. అంతకుముందు ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేస్తునట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్త ని అటు అనుష్క , ఇటు ప్రభాస్ కండించినప్పటికీ సోషల్ మీడియా లో పుకార్లు ఆగలేదు.

  • Written By: Vicky
  • Published On:
Anushka Shetty Marriage: స్టార్ నిర్మాతతో అనుష్క శెట్టి పెళ్లి ఫిక్స్.. ఎవరో తెలిస్తే నోరెళ్లబెడుతారు.

Anushka Shetty Marriage: అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘సూపర్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి, ఆ తర్వాత వచ్చిన ఫేమ్ తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ మరియు సూపర్ హిట్స్ ని అందుకొని, అనతి కాలం లోనే సూపర్ స్టార్ గా ఎదిగిన నటి అనుష్క శెట్టి. ఈమెకి ఒక స్టార్ హీరోకి ఉన్నంత స్టార్ స్టేటస్ ఉంది. బాహుబలి సిరీస్ తర్వాత ఆమె వెండితెర మీద కనిపించిన ‘భాగమతి’ చిత్రం సుమారుగా 35 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది.

ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె వెండితెర మీద కనిపించలేదు.’నిశ్శబ్దం’ అనే సినిమా ద్వారా నేరుగా ఓటీటీ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా, వ్యూస్ పరంగా సౌత్ ఇండియా లో టాప్ 5 చిత్రాలలో ఒకటిగా నిల్చింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు ఈమె యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో ‘MS శెట్టి..MR పోలిశెట్టి’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఇది ఇలా ఉండగా అనుష్క పెళ్లి టాపిక్ ఎప్పటి నుండో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న అంశం. అంతకుముందు ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్టు, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ చేస్తునట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్త ని అటు అనుష్క , ఇటు ప్రభాస్ కండించినప్పటికీ సోషల్ మీడియా లో పుకార్లు ఆగలేదు.

ఇప్పుడు అనుష్క శెట్టి పెళ్లి గురించి వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, ఈమె త్వరలోనే ఒక స్టార్ నిర్మాతని పెళ్లాడబోతుందట. ఆ స్టార్ నిర్మాత కర్ణాటక సినీ పరిశ్రమకి చెందిన వాడని అర్థం అవుతుంది. ఎవరు ఏమిటి అనే విషయం ఇంకా బయటకి రాలేదు కానీ, ఈ ఏడాది లోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు మాత్రం తెలుస్తుంది. ఇంతకీ ఆ లక్కీ ప్రొడ్యూసర్ ఎవరో చూడాలంటూ అభిమానులు తహతహలాడుతున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు