Anushka Shetty: అనుష్కకు ఉన్న అలవాటు ప్రభాస్ కు కోపం తెప్పిచ్చిందా?

మిర్చి, బాహుబలి సినిమాలతో సందడి చేసిన ఈ జంట సూపర్ సక్సెస్ జోడీగా పేరు సంపాదించింది. దీంతో వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీని చూసిన నెటిజన్లు ఈ జంట లవ్ లో ఉందా అంటూ ప్రశ్నించారు.

  • Written By: Suresh
  • Published On:
Anushka Shetty: అనుష్కకు ఉన్న అలవాటు ప్రభాస్ కు కోపం తెప్పిచ్చిందా?

Anushka Shetty: టాలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ లో అయినా కూడా కొన్ని అట్రాక్షన్ జంటలు ఉంటాయి. వారిలో కొంతమంది ప్రేక్షకులను అలరించడంలో వెనకాడరు. ఇలాంటి జంటలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారంటే సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉంటాయి. ఇలాంటి జంటలలో అనుష్క, ప్రభాస్ ఒకరు. ఈ జంట మొదటి సారి బిల్లా అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత కూడా వీరు జతకట్టి నటించిన సినిమాలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు.

మిర్చి, బాహుబలి సినిమాలతో సందడి చేసిన ఈ జంట సూపర్ సక్సెస్ జోడీగా పేరు సంపాదించింది. దీంతో వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీని చూసిన నెటిజన్లు ఈ జంట లవ్ లో ఉందా అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు కూడా. అంతేకాదు వీరి పెళ్లి గురించి అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ అటు అనుష్క, ఇటు ప్రభాస్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు. ఇక వీరు ప్రేమలో ఉన్నారనే వార్తలను ఖండిస్తూ.. మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ఇక వీరు స్నేహంగా మాత్రం కలిసిమెలిసి ఉండేవారు. కాస్త సన్నిహితంగా కూడా మెదిలేవారు. అలా కొన్ని సందర్భాలలో అనుష్క బ్యాడ్ హ్యాబీని ప్రభాస్ మానుకోవాలి అని చెప్పినా కూడా మానుకోలేదట ఈ బ్యూటీ. అయితే అనుష్కకు గోర్లు కొరికే అలవాటు ఉందట. టెన్షన్, ప్రెజర్, కంగారుగా ఉంటే అనుష్క కచ్చితంగా గోర్లు కొరుకుతుందట. అలా చేయవద్దు అని ప్రభాస్ ఎన్ని సార్లు చెప్పినా కూడా మానుకోలేదట అనుష్క. అయితే ఇలాంటి అలవాటు ఉంటే ప్రభాస్ కు అసలు నచ్చదట. దీంతో అనుష్క మానుకుంటాను అని చెప్పినా కూడా తిరిగి మళ్లీ అదే పని చేసేదట. దీంతో ఇక అనుష్క మానుకోదు అని నమ్మిన ప్రభాస్ చెప్పడం కూడా మానేశాడట. ఎప్పుడైనా అనుష్క గోర్లు కొరుకుతుంటే.. చూసి చూడనట్టు అక్కడ నుంచి వెళ్లిపోతుండేనట పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు