Anushka and Shruti Haasan: తెలుగు తెర పై కొన్ని కలయికలు చూడడానికే కాదు, వినడానికి కూడా బాగుండవు. కానీ, ఒక్కోసారి తెలుగు సోషల్ మీడియాలో అలాంటి కలయికలను ముడిపెట్టి కొన్ని రూమర్లను బాగా ప్రచారంలోకి తీసుకు వస్తారు. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ డాటర్ శ్రుతి హాసన్ హీరోయిన్ గా మెగాస్టార్ తో రొమాన్స్ చేయబోతుందని తాజాగా ఓ వార్త వండి వడ్డించారు.

Anushka and Shruti Haasan
మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. చిరు సరసన నటించేందుకు శృతి హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. అయితే, పవర్ స్టార్ సరసన ‘గబ్బర్ సింగ్, కాటమరాయుడు’ చిత్రాల్లో నటించి మెప్పించింది శ్రుతి హాసన్.
Also Read: నీ ప్రేమ సల్లగుండ.. కంగనా.. మోడీని వదలవా?
మరి ఇప్పుడు మెగాస్టార్ సరసన కూడా హీరోయిన్ గా నటిస్తే బాగానే ఉంటుంది. కానీ, బాబీ మాత్రం అనుష్కను హీరోయిన్ గా తీసుకోవాలని ఆశ పడుతున్నాడు. పైగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. కాబట్టి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరం అవుతారు. అందులో ఒక హీరోయిన్ పాత్ర చాలా బలమైనది.
ఆ పాత్రనే అనుష్క చేత చేయించాలని ప్లాన్. మొదట ఈ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను తీసుకోవాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. ముంబై వెళ్లి మరీ సోనాక్షి సిన్హాకి కథ చెప్పారు. కథ సరిగ్గా వినకుండానే ఏకంగా 4 కోట్ల రూపాయల పారితోషికాన్ని అడిగింది ఈ భారీ భామ. అందుకే, అనుష్క వైపు మొగ్గు చూపుతుంది టీమ్. అయితే, మరో హీరోయిన్ పాత్రలో ప్రస్తుతం శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది.
Also Read: ఏమిటి.. సింగర్ సునీత మళ్ళీ తల్లి కాబోతుందా ?