Anuj Rawat: ఎంఎస్‌ ధోనినే మించిపోయాడే.. ఎవర్రా నువ్వు..?

మ్యాచ్‌లో రాజస్తాన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రనౌట్‌ రూపంలో డైమండ్‌ డకౌట్‌ అయ్యాడు. డైమండ్‌ డకౌట్‌ అంటే ఎలాంటి బాల్స్‌ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్‌ రావత్‌ రనౌట్‌ చేసిన విధానం మహేంద్ర సింగ్‌ ధోనిని గుర్తుకుతెచ్చింది.

  • Written By: DRS
  • Published On:
Anuj Rawat: ఎంఎస్‌ ధోనినే మించిపోయాడే.. ఎవర్రా నువ్వు..?

Anuj Rawat: ఐపీఎల్‌ సీజన్‌ 16లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 112 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఏ దశలోనూ టార్గెట్‌ను ఛేదించే ప్రయత్నం చేయలేదు. ఆర్సీబీ బౌలర్ల దాటికి రాజస్థాన్‌ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ బాట పట్టారు. ఈ నేపథ్యంలో 59 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్‌ చరిత్రలో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది.

ధోనీని తలపించిన అనూజ్‌..
ఇక మ్యాచ్‌లో రాజస్తాన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రనౌట్‌ రూపంలో డైమండ్‌ డకౌట్‌ అయ్యాడు. డైమండ్‌ డకౌట్‌ అంటే ఎలాంటి బాల్స్‌ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్‌ రావత్‌ రనౌట్‌ చేసిన విధానం మహేంద్ర సింగ్‌ ధోనిని గుర్తుకుతెచ్చింది. ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ లాస్ట్‌ బాల్‌ని హెట్‌మైర్‌ ఆఫ్‌సైడ్‌ ఆడగా.. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో హెట్‌మైర్‌ అశ్విన్‌కు సెకండ్‌ రన్‌ కోసం కాల్‌ ఇచ్చాడు. అప్పటికే బంతిని అందుకున్న సిరాజ్‌ కీపర్‌ అనూజ్‌ రావత్‌కు త్రో వేశాడు. అప్పటికే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌కు వెళ్లిన రావత్‌.. బంతిని అందుకొని వెనుక వైపు నుంచి వికెట్లపైకి విసిరాడు. గతంలో ఎంఎస్‌ ధోని కూడా ఇలాగే బ్యాక్‌ఎండ్‌ నుంచి వికెట్లను గిరాటేసి బ్యాటర్‌ను ఔట్‌ చేశాడు. ఇప్పుడు అచ్చం ధోని స్టైల్‌ను కాపీ కొట్టిన రావత్‌ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇక ఐపీఎల్‌లో ఒక బ్యాటర్‌ డైమండ్‌ డక్‌ అవ్వడం ఇది ఏడోసారి.

ధోనీ సంతకం చేసిన గ్లౌవ్స్‌తో
ధోనీ సంతకం చేసిన కీపింగ్‌ గ్లౌజ్‌తో అనుజ్‌ రావత్‌ ఈ ఫీట్‌ చేయడం విశేషం. ఈ రనౌట్‌పై సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీన్‌ కనిపించింది. ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ అనుజ్‌ రావత్‌ సూపర్‌ ఫీల్డింగ్‌ చేశాడు. మైదానంలో తన కదలికలతో ఎంఎస్‌ ధోనీని గుర్తుకు తెచ్చాడు.

https://twitter.com/IPL/status/1657731743955431426?s=20

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు