Shani Dosha Nivarana: చీమలకు ఆహారం వేస్తే ఆ బాధలు ఉండవు.. అద్భుత ఫలితాలివీ
మొదటి సారి జీవితంలో వచ్చే ఏలిననాటి శనిని మంగు శని అంటారు రెండోసారి వచ్చే దాన్ని పొంగు శని పిలుస్తారు. మూడోసారి వస్తే మృత్యు శని, జన్మరాశిలో నాలుగు, ఎనిమిది, పది స్థానాల్లో వస్తే అర్ధాష్టమ శని, అష్టమ శని అని చెబుతారు. ఇలా శని దశలు పలు రకాలుగా ఉంటాయి. అవి మనల్ని బాధలకు గురి చేస్తుంటాయి. శని అనుగ్రహం ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. చెడు దృష్టితో ఉంటే ఇలాంటి ఫలితాలు మనల్ని కలవర పెడతాయి.

Shani Dosha Nivarana: శని మనల్ని ఎన్నో బాధలకు గురిచేస్తుంటాడు. జన్మ రీత్యా 12,1,2 స్థానాల్ల శని సంచరించే కాలాన్ని ఏలిననాటి శని అంటారు. ఇది మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. 12వ రాశిలో శని ఉంటే అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, తరచూ ప్రయాణాలు వంటివి కలుగుతాయి. భాగస్వామితో గొడవలు, మనశ్శాంతి కరువు, ఆరోగ్య సమస్యలు, రుణ ఒత్తిడులు ఇలాంటివన్ని శని యోగం వల్ల జరుగుతాయి. ఈ సమయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి.
మొదటి సారి జీవితంలో వచ్చే ఏలిననాటి శనిని మంగు శని అంటారు రెండోసారి వచ్చే దాన్ని పొంగు శని పిలుస్తారు. మూడోసారి వస్తే మృత్యు శని, జన్మరాశిలో నాలుగు, ఎనిమిది, పది స్థానాల్లో వస్తే అర్ధాష్టమ శని, అష్టమ శని అని చెబుతారు. ఇలా శని దశలు పలు రకాలుగా ఉంటాయి. అవి మనల్ని బాధలకు గురి చేస్తుంటాయి. శని అనుగ్రహం ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. చెడు దృష్టితో ఉంటే ఇలాంటి ఫలితాలు మనల్ని కలవర పెడతాయి.
శని మూలంగా వాహన ప్రమాదాలు, అనారోగ్యాలు, ఆస్తుల గొడవలు వంటివి చోటుచేసుకుంటాయి. వ్యాపారంలో సమస్యలు, ఉద్యోగంలో ఆటంకాలు, అశాంతి, శత్రు బాధలు, ఊహించని నష్టాలు వంటివి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పదో స్థానంలో శని ఉంటే దాన్ని దశమ శని పిలుస్తారు. దీంతో చాలా నష్టాలు సంభవిస్తాయి. మనం అన్నింటికి సిద్ధంగా ఉండాలి.
చీమలకు పంచదార వేయడం వల్ల మన శని బాధలు కొంతవరకు తీరుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం నల్ల చీమలకు ఆహారం వేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏలిననాటి శని ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శనీశ్వరుడికి నువ్వులు, నువ్వుల నూనె, నీలం, నల్ల రంగు బట్టలంటే ఎంతో ఇష్టం. వాటిని దానంగా ఇస్తే కూడా శని బాధల నుంచి విముక్తులం కావచ్చు.