ఢిల్లీ అల్లర్ల వెనుక దేశద్రోహ కుట్ర?

ఢిల్లీ అల్లర్లు ఆందోళనకరం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన జరిపేటప్పుడే ఈ అల్లర్లు జరగటం కాకతాళీయం కాదు. ఓ పధకం ప్రకారం కుట్ర పూరితంగానే ఈ అల్లర్లు జరిగినట్లు తెలుస్తుంది. లేకపోతే కరెక్టుగా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. కొన్ని వీడియో ల్లో డైరెక్టుగానే నిరసనలు, అల్లర్లు జరిగితేనేగాని భారత్ కు బయటనుంచి పెట్టుబడులు ఆగిపోవని మాట్లాడటం చూసాం. దురదృష్టవశాత్తు ఆ వీడియో చూసిన తర్వాతైనా నిరసనలకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలు వాటిని ఖండించి వుండాల్సింది. […]

  • Written By: Ram Katiki
  • Published On:
ఢిల్లీ అల్లర్ల వెనుక దేశద్రోహ కుట్ర?

ఢిల్లీ అల్లర్లు ఆందోళనకరం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన జరిపేటప్పుడే ఈ అల్లర్లు జరగటం కాకతాళీయం కాదు. ఓ పధకం ప్రకారం కుట్ర పూరితంగానే ఈ అల్లర్లు జరిగినట్లు తెలుస్తుంది. లేకపోతే కరెక్టుగా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. కొన్ని వీడియో ల్లో డైరెక్టుగానే నిరసనలు, అల్లర్లు జరిగితేనేగాని భారత్ కు బయటనుంచి పెట్టుబడులు ఆగిపోవని మాట్లాడటం చూసాం. దురదృష్టవశాత్తు ఆ వీడియో చూసిన తర్వాతైనా నిరసనలకు మద్దతిచ్చే రాజకీయ పార్టీలు వాటిని ఖండించి వుండాల్సింది. కానీ అలా జరగలేదు.

నిరసన తెలపటం ప్రజల ప్రాధమిక హక్కు. కానీ ఆ పేరుతో మిగతా వాళ్ళ హక్కులను హరించే పని చేయకూడదు. గత రెండు నెలల నుంచి జరుగుతున్న నిరసనల్లో దేశ వ్యతిరేక స్లోగన్లు ఇవ్వటం పరిపాటయ్యింది. సుప్రీమ్ కోర్ట్ కూడా నిరసనకారులకు ఎంత హక్కు వుందో రోడ్డు బ్లాక్ చేయటం వలన నష్టపోయే వాళ్లకు కూడా అంతే హక్కుఉందని తెలిపింది. అంతవరకూ సర్దుకుందామనుకున్నా నిన్న, ఈరోజు జరుగుతున్న హింసతో కూడిన నిరసనలు ఏ మాత్రం సమర్ధించలేము. రాళ్లు విసరటం అతి పురాతన, అనాగరిక చర్య. దీన్ని ఓ ఆయుధంగా వాడుకోవటం ఇన్నాళ్లనుంచి చెబుతున్న శాంతి కాముక, రాజ్యాంగ బద్ద నిరసన ఎంత బూటకమో అర్ధమవుతుంది. దానితోపాటు అమెరికా అధ్యక్షుడి రాక రోజుని సెలెక్ట్ చేసుకోవటంలో పెద్ద కుట్ర దాగివుంది.

అమెరికా అధ్యక్షుడు రాక తో అంతర్జాతీయ మీడియా భారత్ పై సహజంగానే ఫోకస్ పెడతాయి. ఆ సమయంలో అల్లర్లు చేయగలిగితే ట్రంప్ రాకపై వచ్చే సానుకూల వార్తలతోపాటు భారత్ ప్రతిష్ట కూడా మంటగలపొచ్చని కుట్ర జరిగింది. అమెరికా అధ్యక్షుడి రాకతో విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ అల్లర్లు చెలరేగాయి. నిరసన ప్రదర్శనల్లో మాట్లాడే కొంత మంది మత పెద్దలు ఈ విషయం బహిరంగంగానే మాట్లాడటం ఈ కుట్రను చెప్పకనే చెపుతున్నాయి. పాకిస్తాన్ ప్రమేయం ఇందులో వుందనేది ప్రభుత్వ వర్గాలు బలంగా నమ్ముతున్నారు. చివరకు ఈరోజు ట్రంప్ పత్రికా విలేఖర్ల సమావేశంలో దీన్నిపనిగట్టుకొని ప్రస్తావించటం వీరి కుట్రను మరొక్కసారి బయటపెట్టింది. ఇప్పుడైనా కాంగ్రెస్ లాంటి జాతీయపార్టీలు ఈ అల్లర్ల పధకాన్ని నిర్ద్వందంగా ఖండించకపోవడం విచారించదగ్గ విషయం. దేశమా పార్టీ ప్రయోజనమా ఏది ముఖ్యం రాహుల్ గాంధీ గారూ ? ఈ కుట్రను కూడా ఖండించకపోతే మిమ్మల్ని పూర్తిగా ప్రజలే ఖండించే రోజు దగ్గర్లో వుంది. ఇప్పటికే ఆ పని చాలా ముందుకు వెళ్ళింది. ముందు ముందు కాంగ్రెస్ ని అటు హిందువులు, ఇటు ముస్లింలు కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అర్దముచేసుకుంటే మంచిది.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు