Ante Sundaraniki OTT Release Date: నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ ఓటీటీ అధికారిక డేట్ వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసింది. అంటే సుందరానికీ థియరిటికల్ రన్ ముగిసిన నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటనతో వచ్చేసింది. అంటే సుందరానికీ చిత్రం నానికి షాక్ ఇచ్చింది. మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మంచి వసూళ్లు సాధిస్తుందని ఆయన భావించారు. అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద అంటే సుందరానికీ బోల్తాకొట్టింది.

Ante Sundaraniki Movie
దర్శకుడు వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికీ తెరకెక్కించారు. మూడు హిట్ చిత్రాలు థియేటర్స్ లో ఉండడం కూడా అంటే సుందరానికీ ఫలితాన్ని దెబ్బ తీసింది. జూన్ 3న విడుదలైన విక్రమ్, మేజర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. అలాగే ఎఫ్3 ఇంకా థియేటర్స్ లోనే ఉంది. ప్రేక్షకులు మేజర్, విక్రమ్, ఎఫ్3 పై పెట్టిన దృష్టి నాని అంటే సుందరానికీ పై పెట్టలేదు. ఇక భారీగా పెరిగిన టికెట్స్ ధరలు కూడా సినిమా ఘోర పరాజయానికి కారణం అంటున్నారు.
Also Read: Pavan Kalyan Bandla Ganesh: బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ అందుకే దూరం పెట్టాడా?
అంటే సుందరానికీ మూవీ రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ చిత్ర టార్గెట్ రూ. 31 కోట్ల వరల్డ్ వైడ్ షేర్. మూవీ రన్ దాదాపు ముగియగా ఆ టార్గెట్ చేరుకునే దాఖలాలు లేవు. అంటే సుందరానికి ఇప్పటి వరకు రూ. 18 నుండి 19 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. అంటే రూ. 10 కోట్లకు పైగా నష్టాలు ఈ చిత్రం మిగిల్చింది. జూన్ 10న విడుదలైన అంటే సుందరానికీ రన్ ముగిసిన కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

Ante Sundaraniki movie
అంటే సుందరానికీ చిత్రం జులై 8 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అధిక ధరల కారణంగా థియేటర్స్ లో అంటే సుందరానికీ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేదు. ఈ క్రమంలో ఓటీటీలో ఆదరణ దక్కించుకునే అవకాశం కలదు. మైత్రి మూవీ మేకర్స్ అంటే సుందరానికీ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, రోహిణి, నదియా కీలక రోల్స్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
Also Read:Minister Roja- Dubai Vacation: దుబాయ్ ఎడారిలో తన సరదాలు అన్నీ తీర్చుకున్న మంత్రి రోజా