Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మరో సెన్సషనల్ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇక పండగే !

ఈ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ యాటిట్యూడ్, స్టైల్ మరియు స్వాగ్ ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో అలరించింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లోని వింటేజ్ యాంగిల్ ని కేవలం పది రోజుల షెడ్యూల్ లో బయటకి తీసాడంటే, హరీష్ శంకర్ మాస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ని నాకు మించిన గొప్పగా ఎవ్వరూ చూపించలేరని కేవలం ఈ చిన్న గ్లిమ్స్ వీడియో తోనే నిరూపించుకున్నాడు హరీష్ శంకర్.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ వచ్చే నెల 26 వ తేదీ నుండి ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

  • Written By: Vicky
  • Published On:
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మరో సెన్సషనల్ అప్డేట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇక పండగే !

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ లాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న రెండవ సినిమా ఇది. ఎప్పుడో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవాల్సిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఎట్టకేలకు కొద్దీ రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. కేవలం 15 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకున్న ఈ మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ ని పూర్తి చేసి రీసెంట్ గానే ఒక గ్లిమ్స్ వీడియో ని వదిలారు. ఈ గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ ఊర మాస్ యాటిట్యూడ్, స్టైల్ మరియు స్వాగ్ ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో అలరించింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ లోని వింటేజ్ యాంగిల్ ని కేవలం పది రోజుల షెడ్యూల్ లో బయటకి తీసాడంటే, హరీష్ శంకర్ మాస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ని నాకు మించిన గొప్పగా ఎవ్వరూ చూపించలేరని కేవలం ఈ చిన్న గ్లిమ్స్ వీడియో తోనే నిరూపించుకున్నాడు హరీష్ శంకర్.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన రెండవ షెడ్యూల్ వచ్చే నెల 26 వ తేదీ నుండి ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ కి సంబంధించి సెట్స్ వర్క్ ని కూడా పూర్తి చేసింది మూవీ టీం. ఒక స్కూల్ మరియు చుట్టుపక్కన ఉండే పోలీస్ హెడ్ క్వాటర్స్ తో పాటుగా పవన్ కళ్యాణ్ వాడే జీపు కూడా ఈ సెట్స్ లో ఉన్నాయి. 26 వ తేదీన ఒక అదిరిపోయే మాస్ పోస్టర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది మూవీ టీం.

సంబంధిత వార్తలు