Mahesh-Rajamouli Movie : మహేష్ బాబు సినిమా కన్నా ముందు మరో ప్రాజెక్ట్.. ప్లాన్ మార్చిన రాజమౌళి.. అఫీషియల్ ప్రకటన ఇచ్చిన దర్శకుడు …
కాబట్టి ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందేమో అని అంచనాలు పెంచుకుంటున్నారు ప్రేక్షకులు. కాగా ఈ సినిమా కథ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Mahesh-Rajamouli Movie : బాహుబలి తో ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అందుకొని అంతర్జాతీయంగా అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడి తదుపరి ప్రాజెక్టు పై అందరి దృష్టి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఏ సినిమా తీస్తారో అని ప్రపంచం మొత్తం ఆలోచిస్తూ ఉండగా దానికి తగ్గట్టే భారీ బడ్జెట్ తో మహేష్ బాబుతో సినిమా ప్రకటించాడు.
కానీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఎన్నో రోజులు అవుతున్నా కానీ ఇంకా మహేష్ బాబు తో తన సినిమాని మాత్రం మొదలు పెట్టలేదు రాజమౌళి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చెప్తూ వస్తున్న కానీ.. ఈ సినిమా షూటింగ్ లాంచ్ డేట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అందరూ ఎదురు చూస్తుండగా.. తన మరో సినిమా గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు రాజమౌళి.
దర్శకధీరుడు రాజమౌళి తన కొత్త సినిమాను ప్రకటించాడు. అవును మీరు విన్నది నిజమే కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేమిటి అంటే ఈ కొత్త సినిమాకు ఆయన దర్శకుడు కాదు. కేవలం సమర్పకుడు. ఇక ఈ సినిమాని రాజమౌళి కొడుకు నిర్మించడం మరో విశేషం. రాజమౌళి సమర్పణలో ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీ మీద రాజమౌళి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. మేడ్ ఇన్ ఇండియా అంటూ ఈ సినిమా రాబోతోందంటూ రాజమౌళి ట్వీట్ వేశాడు.
ఫస్ట్ కథ,కథనం విన్నప్పుడే నేను కదిలిపోయాను.. ఎంతో ఎమోషనల్‌కు లోనయ్యాను.. అసలు బయోపిక్ అనేది చేయడమే చాలా కష్టమైన పని.. అలాంటిది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ తీసి మెప్పించడం అంటే అది పెద్ద సవాలే.. మా వాళ్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు.. మేడ్ ఇన్ ఇండియాను ఎంతో సగర్వంగా ప్రజెంట్ చేస్తున్నాను అని రాజమౌళి ట్వీట్ వేశాడు.
ఇక ఈ ట్వీట్ రాజమౌళి షేర్ చేసిన దగ్గర నుంచి.. ఈ సినిమా గురించి ప్రేక్షకులు తెగ ఆలోచిస్తున్నారు. రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నాడంటే.. ఆ కథ, కథనం, మేకింగ్, టేకింగ్ ఇలా అన్నింట్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. కాబట్టి ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందేమో అని అంచనాలు పెంచుకుంటున్నారు ప్రేక్షకులు. కాగా ఈ సినిమా కథ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
