నిర్భయ దోషుల ఉరికి మరో అడ్డంకి…

నిర్భయ కేసులో నలుగురు దోషులు ఉరిశిక్ష అమలులో మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దోషులను ఉరిశిక్షనుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉరిశిక్ష అమలు చేయడానికి ఉద్దేశించిన పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దోషులుగా ఉన్న పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ రాథోడ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు చేసేలా అనుతి ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు […]

  • Written By: Neelambaram
  • Published On:
నిర్భయ దోషుల ఉరికి మరో అడ్డంకి…


నిర్భయ కేసులో నలుగురు దోషులు ఉరిశిక్ష అమలులో మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దోషులను ఉరిశిక్షనుండి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉరిశిక్ష అమలు చేయడానికి ఉద్దేశించిన పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో దోషులుగా ఉన్న పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ రాథోడ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు చేసేలా అనుతి ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ అధికారులు సుప్రీంను ఆశ్రయించారు.. ఈ పిటిషన్‌పై విచారణను మార్చి 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. దీంతో దోషులుకు ఉరిశిక్ష అమలు మరోసారి నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా, ఉరిశిక్షను అమలు చేయడానికి ఢిల్లీ న్యాయస్థానం ఇదివరకే డెత్ వారెంట్‌ను జారీ చేసింది.. దాని ప్రకారం మర్చి నెల 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఆ నలుగురిని తీహార్ జైలులో ఉరి తీయాల్సి ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఈ సారి కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.