Tollywood Heroine Self-Destruction: ఇటీవల కాలం లో సినీ పరిశ్రమకి సంబంధించిన వారి మరణ వార్తలు ఎక్కువ అయ్యిపోయాయి..ఎంతో మంది దిగ్గజ నటులు, గాయకులూ మరియు క్యారక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది సినీ అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసి ప్రాణాలను వదిలారు..కొంతమంది అస్వస్థతో మరణిస్తే..కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..మొన్ననే ఒక్క ప్రముఖ ఫాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మనం ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో తార ఆత్మహత్య చేసుకుంది..‘కెమిటి కహిబి కహా’ అనే ఒడియా సీరియల్ తో మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న ప్రముఖ నటి రష్మీ రేఖ ఓజా, భువనేశ్వర్‌లోని గదసాహీ అనే ఊరిలో ఒక్క అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది..ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిని సోదా చెయ్యక పోలీసులకు ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది..ఇందులో ఆమె ‘నా చావుకి ఎవ్వరు కారణం కాదు..ఐ లవ్ యూ సాన్..ఐ మిస్ యు’ అంటూ రాసి ఉంది..అనుమానాస్పదంగా ఉన్న ఈ లేఖను పోలీసులు స్వాధీనపర్చుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Rashmi Rekha
Also Read: Jagan Government: కీలక నిర్ణయాలు దిశగా జగన్ సర్కారు.. కేబినెట్ లో చర్చించే అంశాలివే..
ఈ లేఖ ఎవరో ఈ అమ్మాయిని హత్య చేసి కావాలని రాసినట్టు ఉందని..నిజానిజాలు ఏమిటో త్వరలోనే కనిపెడుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు..అయితే రష్మీ రేఖ సంతోష్ అనే అబ్బాయి ని ప్రేమించి వివాహం చేసుకుంది..వీళ్లిద్దరు కలిసి ఒక్కే ఇంట్లో ఉంటున్నట్టు చుట్టుపక్కన ఉన్న స్థానికులు తెలిపారు..తన కూతురుని ఆ సంతోష్ అనే అబ్బాయి చంపి ఉంటాడని..మా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికి అమ్మాయి కాదని రష్మీ రేఖ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు..ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ‘జూన్ 18 వ తారీఖున రష్మీ కి ఎన్నో సార్లు కాల్ చేసాము..కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు..ఏమి జరిగిందో ఏమో అని ఆందోళన చెందుతున్న సమయం లో సంతోష్ ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయింది అని చెప్పాడు..అసలు వీళ్లిద్దరి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకొని ఒక్కే ఇంట్లో నివసిస్తున్నారు అనే విషయం మాకు ఇప్పటి వరుకు తెలియదు’ అంటూ చెప్పుకొచ్చాడు రష్మీ తండ్రి..రష్మీ వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే..ఇంత చిన్న వయసులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.

Rashmi
Also Read: Top 10 Livable Cities : ప్రపంచంలోనే టాప్- 10 నివాసయోగ్య నగరాలేవో తెలుసా?
Recommended Videos