Hyderabad: బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లో మహిళపై అత్యాచారం, హత్య
హైదరాబాద్ నగరంలోని గౌలిదొడ్డి ప్రాంతంలోని కేశవ నగర్ కు చెందిన ఓ మహిళ, తన భర్త, పిల్లలతో కలిసి ఉంటోంది. భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. ఆమె వేస్ట్ మెటీరియల్ సేకరించి అమ్ముతోంది.

Hyderabad: మొన్న ఓ మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటన మరువక ముందే హైదరాబాదులో మరో దారుణం చోటుచేసుకుంది. ఆధునిక హైదరాబాదులోని ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. అనంతరం దుండగులు ఆమెను ఒక బండరాయితో కొట్టి చంపారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసు బృందాలు నిందితుల కోసం జల్లెడ పడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల ఫుటేజీ ని పరిశీలిస్తున్నాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం..
హైదరాబాద్ నగరంలోని గౌలిదొడ్డి ప్రాంతంలోని కేశవ నగర్ కు చెందిన ఓ మహిళ, తన భర్త, పిల్లలతో కలిసి ఉంటోంది. భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. ఆమె వేస్ట్ మెటీరియల్ సేకరించి అమ్ముతోంది. అయితే గత మూడు రోజుల క్రితం నానక్ రాం గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులో కి వెళ్ళింది. అక్కడ చెత్తను ఏరుకుంటున్నది. అక్కడ ఉన్న నలుగురు ఆమెను చెత్త ఏరకుండా అడ్డుకున్నారు. కోరిక తీర్చమని బలవంతం చేశారు. దీంతో ఆమె బెదిరిపోయింది. తనను వదిలిపెట్టమని బతిమిలాడుకుంది. మద్యం మత్తులో ఉన్న వారు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బండరాయితో ఆమెను హత్య చేశారు.
అయితే ఆ బాధిత మహిళ భర్త.. తన భార్య కనిపించడం లేదని మూడు రోజుల క్రితం స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే మంగళవారం ఉదయం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.. ఈ విషయాన్ని పోలీసులు ఆ వ్యక్తికి చేరవేశారు. అతడిని సంఘటన స్థలానికి తీసుకొచ్చి మృతురాలిని చూపించగా.. కన్ను మూసింది తన భార్యేనని గుర్తించాడు. కాగా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఈ కేసు విచారణ కొనసాగిస్తున్నాయి.
View this post on Instagram
