మినిస్టర్ అనిల్ యాదవ్ మమ్మల్ని ‘చీప్ పీపుల్’ అన్నాడు: ప్రీతీ తల్లి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతీకి జరిగిన అన్యాయంపై స్పందించటానికి ఈ రోజు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ప్రీతీ తల్లి మాట్లుడుతూ..న్యాయం కోసం ఆశ్రయిస్తే మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ తమను చీప్ పీపుల్ అన్నాడనే విషయం చెపుతూ..బోరున విలపించారు. న్యాయం కోసం అందరి నాయకులని ఆశ్రయించామని..కానీ ఎవరు స్పందించలేదని ప్రీతీ తల్లి దుఃఖంతో వెల్లడించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల దెగ్గరికి వెళ్లిన తమకి న్యాయం జరగలేదని..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా […]

  • Written By: Raghava
  • Published On:
మినిస్టర్ అనిల్ యాదవ్ మమ్మల్ని ‘చీప్ పీపుల్’ అన్నాడు: ప్రీతీ తల్లి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతీకి జరిగిన అన్యాయంపై స్పందించటానికి ఈ రోజు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ప్రీతీ తల్లి మాట్లుడుతూ..న్యాయం కోసం ఆశ్రయిస్తే మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ తమను చీప్ పీపుల్ అన్నాడనే విషయం చెపుతూ..బోరున విలపించారు. న్యాయం కోసం అందరి నాయకులని ఆశ్రయించామని..కానీ ఎవరు స్పందించలేదని ప్రీతీ తల్లి దుఃఖంతో వెల్లడించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీల దెగ్గరికి వెళ్లిన తమకి న్యాయం జరగలేదని..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆమె విశ్వసించారు. కొందరు పోలీసు అధికారులు డబ్బుకి ఆమూడు పోయి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారనే నిజాన్ని బట్టబయలు చేసారు.

పవన్ కళ్యాణ్ ఈ విషయమై మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వానికి న్యాయం చేసేందుకు కొంత గడువు ఇచ్చారు. వెంటనే లిఖిత పూర్వకంగా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అయన డిమాండ్ చేసారు. పక్క రాష్ట్రంలో జరిగిన దిశా విషయంలో చూపిన చొరవ..ప్రీతీ విషయంలో ఎందుకు చూపలేదని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం న్యాయం చేయటంలో విఫలమైతే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని పవన్ తెలిపారు.

సంబంధిత వార్తలు