పూనకం తో ఊగిపోయిన అనీ మాస్టర్: బిగ్ బాస్ లో కెప్టెన్సీ కంటెండర్ల హోరు ఒక హోరు జోరు లా సాగింది. ఎనిమిదో వారం చివరకి చేరుకున్న బిగ్ బాస్ లో ఇదొక రచ్చ రంబోలా జరగాల్సిందే. అయితే నిన్న (గురువారం) తో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. సన్నీ, మానస్, సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, శ్రీరామ చంద్ర కెప్టెన్సీ టాస్క్ బరి లో పాల్గొనగా… అందులో షన్ను ఎనిమిదో వారానికి గాను కెప్టెన్ అయ్యాడు.

Anee Master
ఈ నేపథ్యం లో కంటెస్టెంట్ల మధ్య పెద్ద రచ్చ నే జరిగింది. కెప్టెన్సీ కంటెండర్లకి థర్మాకోల్ బాల్స్ కలిగిన గోనె సంచులని బిగ్ బాస్ ఇస్తాడు. పోటీదారులు ధర్మా కాల్ బ్యాగులను ధరించి సర్కిల్ గీసి ఉన్న ట్రాక్ పై ఆపకుండా నడవాల్సి ఉంటుంది. బజర్ మోగేలోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ థర్మాకోల్ బాల్స్ గోనె సంచిలో ఉంటాయో వాల్లే కెప్టెన్సీ టాస్క్ లో విజేతగా నిలిచి ఎనిమిదో వారానికి కెప్టెన్ అవుతారు. ఈ టాస్క్ కి జెస్సీ సంచలకుడిగా వ్యవహరించాడు.
అయితే గేమ్ మొదలయిన కొద్ది సేపటికే శ్రీరామ చంద్ర, సన్నీ ఎటాక్ మోడ్ లోకి దిగారు. దీంతో ఇద్దరు కిందపడగా… సన్నీ అవుట్ అంటూ బయటకి పంపించాడు జెస్సీ. దాని తర్వాత శ్రీరామ చంద్ర, సన్నీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రియా గారు కరెక్ట్ గా ఆడారంటూ శ్రీరామ్, సన్నీ ని రెచ్చగొట్టాడు. నువ్వొక ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా.. కానీ కాదు నువ్వు అంటూ పదే పదే సన్నీ ని రెచ్చగొట్టి గాల్లో కిస్ లను పంపుతూ గొంతు అదుపులో పెట్టుకో సన్నీ అంటూ వారించాడు.
దాని తర్వాత రౌండ్ లో శ్రీరామ్, మానస్ ఇద్దరు కిందపడిపోయారు.. దీంతో ఇద్దరిని గేమ్ నుండి తొలగించాడు జెస్సీ. ఇంకా అనీ మాస్టర్, సిరి, షణ్ముఖ్ మిగిలారు. అయితే ఇద్దరు కలిసి నన్నే టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ ఇండివిడ్యువల్ గేమ్ లేదు, నిజాయితీ లేదు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ, చిందులు తొక్కుతూ గేమ్ నుండి బయటకి వచ్చి తన గోడు ని వెళ్లబోసుకుంది అనీ మాస్టర్. టార్గెట్ చేస్తూ, అరుస్తూ గేమ్ ఆడిన ప్రియా తన గొయ్యి తనే తవ్వుకుని మరి ఏడోవారానికి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం లో అనీ మాస్టర్ నామినేషన్స్ లో ఉంటే కచ్చితం గా ఎలిమినేట్ అయ్యేదే. తొమ్మిదో వారం లో ఇంకా ఇలానే అరుస్తూ, టార్గెట్ చేస్తే అనీ మాస్టర్ కచ్చితం గా ఎలిమినేట్ అవ్వక మానదు.