Deputy CM Pawan Kalyan : ఏపీలో( Andhra Pradesh) సోషల్ మీడియా దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొన్న ఆ మధ్యన సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెద్ద ఎత్తున కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గత ఐదేళ్లుగా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హవా తగ్గడం లేదు. తాజాగా కుంభమేళాకు హాజరయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో ఆయన షర్ట్ తీసి కనిపించారు. దీంతో ఆయన ధరించిన జంధ్యంపై రకరకాల చర్చ నడిచింది.
* వివాదాస్పద పోస్ట్
అయితే ఇప్పుడు అనుహ్యంగా కొందరు సోషల్ మీడియాలో( social media) ఆయన బాడీ షేమింగ్ పై వివాదాస్పద పోస్టులు పెట్టారు. పవన్ పొట్ట ఏంటి ఇలా అయిపోయిందని… రాజకీయాల్లోకి వస్తే ఇలానే అని.. కాంట్రవర్సీగా పోస్టులు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ పోస్టులు పెట్టారు. అయితే ఒకేసారి పెద్ద ఎత్తున రోల్ జరుగుతుండడంతో ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది ఆరా తీస్తున్నారు.
* పోలీసులకు ఫిర్యాదు
ఇటీవల సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో( Sampoornesh Babu ).. పవన్ కళ్యాణ్ ను పోలుస్తూ Harsha reddy @Harsha 88889× సోషల్ మీడియా ఖాతాలో ఫోటో పోస్ట్ అయ్యింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జనసేన నేత రిషికేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లా కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పోస్టు మూలంగా జనసేన వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి మారింది.
* ఢిల్లీకి అటు నుంచి అటే కుంభమేళాకు( Kumbha Mela ) హాజరైన పవన్ కళ్యాణ్ అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. దాదాపు ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఆ రాష్ట్రాల డిప్యూటీ సీఎం కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా ముచ్చటించడం విశేషం.