Tirupathi  Laddu Issue : తిరుపతి లడ్డు వివాదం లో పవన్ కళ్యాణ్ కి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్..వైరల్ అవుతున్న ట్వీట్!

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ గారూ..ఈ ఘటన మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది. దయచేసి ఈ ఘటనపై విచారణ చేపట్టి దోషులను శిక్షించండి. వాళ్లపై మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ మీరు ఎందుకు ఈ ఆందోళనలను జాతీయ స్థాయిలో వ్యాప్తి చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : September 20, 2024 9:47 pm

Tirupathi Laddu Controvercy

Follow us on

Tirupathi  Laddu Issue :  కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ‘మంచి ప్రభుత్వం’ అనే పేరు మీద కార్యక్రమం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం లో టీడీపీ, జనసేన, బీజేపీ కి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ప్రభుత్వం ఈ వంద రోజుల్లో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు గురించి కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాం లో తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగిన అక్రమాల గురించి చెప్పుకొచ్చాడు. కోట్లాది మంది భక్తులు దివ్యంగా భావించే తిరుపతి లడ్డు తయారీ కోసం జంతువుల కొవ్వు, పంది కొవ్వు తో తయారు చేసిన నెయ్యిని, అలాగే ఫిష్ ఆయిల్ ని కూడా ఉపయోగించారు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది. గత 5 ఏళ్ళు లడ్డూల నాణ్యత తగ్గడానికి అసలు కారణం ఇదేనంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు నేషనల్ మీడియా వరకు పాకింది. మాజీ సీఎం జగన్ ని అందరూ అడ్డమైన బూతులు తిడుతున్నారు.

ఈ అంశంపై మాజీ సీఎం జగన్ నేడు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి డ్యామేజ్ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసాడు కానీ, అది వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈ అంశంపై ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ఇలాంటివి కచ్చితంగా అరికట్టాల్సిన అవసరం మాపై ఉంది. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు ని ఏర్పాటు చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. కానీ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం దీనికి కౌంటర్ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారూ..ఈ ఘటన మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగింది. దయచేసి ఈ ఘటనపై విచారణ చేపట్టి దోషులను శిక్షించండి. వాళ్లపై మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ మీరు ఎందుకు ఈ ఆందోళనలను జాతీయ స్థాయిలో వ్యాప్తి చేస్తున్నారు. దేశం లో ఇప్పటికే మతపరమైన వివాదాలు, సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు అవసరమా. అలాగే కేంద్రం లో మీరు స్నేహం చేస్తున్న ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రకాష్ రాజ్. ఈ ట్వీట్ కి పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకొని పడి ప్రకాష్ రాజ్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. బద్రి చిత్రం లో ప్రకాష్ తో పవన్ కళ్యాణ్ చెప్పే ‘ఎవడ్రా నువ్వు..నువ్వు ఎవడివి రా మధ్యలో’ అనే డైలాగ్ ఉన్న వీడియో ని పోస్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ మొదటి నుండి బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం అనే సంగతి తెలిసిందే. జనసేన పార్టీ బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం పై ఆయన మొదటి నుండి అసంతృప్తితోనే ఉన్నారు, అందులో భాగంగానే ఆయన ఈ ట్వీట్ వేసాడు.