Homeఆంధ్రప్రదేశ్‌ YCP Leader  harassed Bollywood actress : బాలీవుడ్ నటికి వైసిపి టార్చర్.. ఎవరామె? ఏంటా కథ?

 YCP Leader  harassed Bollywood actress : బాలీవుడ్ నటికి వైసిపి టార్చర్.. ఎవరామె? ఏంటా కథ?

YCP Leader  harassed Bollywood actress : వైసీపీ నేతలు టాలీవుడ్ నే కాదు..బాలీవుడ్ ను కూడా టచ్ చేశారు. ముంబాయికి చెందిన ఓ బాలీవుడ్ నటిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు ఓ వైసిపి నేత. బాలీవుడ్ లో పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన సదరు నటి వైసీపీ నేత కుమారుడితో లవ్ లో పడినట్లు తెలుస్తోంది. అయితే ఆ పెళ్లికి వైసిపి నేత కుటుంబం అంగీకరించలేదు. అలాగని ఆ నటి వెనక్కి తగ్గలేదు.దీంతో విజయవాడ తీసుకొచ్చి ఆమెను భయపెట్టినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబాన్ని సైతం చిత్రహింసలు పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో ఓ ఐపీఎస్ అధికారి అతిగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా వైసీపీ నేత కుమారుడు ఆ నటితో ప్రేమలో ఉన్నాడు.పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.అయితే ఈ విషయం వైసీపీ నేత కుటుంబానికి తెలియడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్లో ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి సాయం తీసుకున్నారు. తమ కుమారుడి జోలికి రావద్దని సదరు నాటికి పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె వెనక్కి తగ్గకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఓ ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగారు. ఆ నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి హింసించారు.అప్పట్లో వారిపై ఒక ప్రైవేటు వ్యక్తితో కేసు కూడా వేయించారు. ఆ కేసు నేపథ్యంలో ఆ నటితో పాటు కుటుంబ సభ్యులను సబ్ జైలుకు తరలించారు. దీంతో భయపడిన ఆనాటి పెళ్లి ప్రపోజుల్ నుంచి విరమించుకుంది . కుటుంబ సభ్యులతో ముంబాయి వెళ్లిపోయింది.

* ఒక్కో ఘటన వెలుగులోకి
ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతోంది. అప్పట్లో ఆ బాలీవుడ్ నటి విషయంలో జరిగిన ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. సదరు నటి తిరిగి వచ్చి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే.. తేనె తుట్ట కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ఎఫ్ఐఆర్ కాపీ తప్ప.. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాధిత కుటుంబం నోరు విప్పడం లేదని తెలుస్తోంది.

* విజయవాడ తెచ్చి చిత్రహింసలు
అయితే తాజాగా ఆ నటి వ్యవహారం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఆ హీరోయిన్ ఎవరు? సదరు వైసీపీ నేత ఎవరు? అనేది రకరకాలుగా ప్రచారం సాగుతోంది. బాధితురాలు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలపై ఇటువంటి ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో సదరు బాధితురాలైన నటి ఏపీ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూటమి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ కు దిగే అవకాశాలు ఉన్నాయి.

* ఆ వివాదాలు కొనసాగుతుండగానే
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల దుమారం తగ్గడం లేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ఇంకా నలుగుతూనే ఉంది. మరో ఎమ్మెల్సీ అనంత బాబు అసభ్య వీడియో సైతం బయటకు వచ్చింది. దీనిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్ధపడుతోంది. ఇప్పుడేమో తాజాగా బాలీవుడ్ నటిపై వేధింపుల అంశం బయటకు వచ్చింది. ఒకవేళ బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేస్తే రచ్చ రచ్చ కావడం ఖాయం. అయితే కచ్చితంగా ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతారు. బాధితురాలతో ఫిర్యాదు చేయిస్తారు. మున్ముందు దీనిపై ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular