Nitish Kumar Reddy : టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో అదరగొట్టిన తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy).. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖకు వచ్చాడు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక నాలుగు రోజుల క్రితం తిరుతి వెళ్లిన నితీశ్ తర్వాత విశాఖలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగియడంతో గురువారం(జనవరి 16న) ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Chandrababu)ను కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కుటుంబంతో కలిసి వెళ్లారు. తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి సీఎంతో నితీశ్ సమావేశమయ్యారు. వారివెంట ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు. ఇందులో విజయవాడ ఎంపీ కేశినేటి చిన్ని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు క్రికెటర్ నితీశ్‌కు రూ.25 లక్షల చెక్కును అందించారు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ఆ చెక్కును సీఎం అందించారు. తండ్రి ముత్యాలరెడ్డితో కలిసి నితీశ్ ఈ చెక్కును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
ఇంటి వద్దే నితీశ్..
ఆస్ట్రేలియా టూర్లో బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. ఓ సెంచరీ చేశాడు. యువ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. టూర్ ముగిసిన తర్వాత ఇండియాకు వచ్చిన నితీశ్ ఇటీవలే ఏపీకి వచ్చాడు. ప్రస్తుతం విశాఖలోని తన ఇంటివద్దే ఉంటున్నాడు. సొంత రాష్ట్రానికి వచిచన తర్వాత తిరుపతికి వెళ్లాచ్చాడు. తిరుపతిలో మెట్లు ఎక్కిన ఫొటోలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తరా్వత సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేలు నిర్వహిసు్తన్న భీమవరం వెళ్లాడు. సాధారణ పౌరుడిలా కోడి పందేలు వీక్షించాడు. ఇప్పుడు సీఎం చంద్రబాబును కలిశాడు.
Met with the exceptionally talented young cricketer, our very own @NKReddy07, today. Nitish is truly a shining star of the Telugu community, bringing pride to India on the global stage. I commended his parents for the support they’ve given him throughout his journey. Wishing him… pic.twitter.com/qEGHXvkMDw
— N Chandrababu Naidu (@ncbn) January 16, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ap cm chandrababu naidu hands over rs 25 lakh cheque to cricketer nitish kumar reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com