India Today Survey : టీడీపీ బీజేపీ కలుస్తుందా? పవన్ కళ్యాణ్ కలుపుతాడా? ఏం జరుగుతుంది?
బీజేపీ చిన్న పార్టీనా? టీడీపీ ఏం చెబితే అది వింటారా? టీడీపీ, బీజేపీ కలయికపై ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం.
India Today Survey : నిన్న ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేసింది. కాకపోతే తెలుగునాట ఈ కార్యక్రమానికి విపరీతమైన హైప్ తెచ్చింది. ఓ రెండు ఫొటోలు వైరల్ అయ్యాయి. పైన రాష్ట్రపతి ఉండగా.. కింద నడ్డా, చంద్రబాబు మాట్లాడుకోవడం.. లాబీలో టీ తాగుతూ చంద్రబాబు, పక్కన ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జేపీ నడ్డాతో భేటి కావడం.. పురంధేశ్వరిని టీడీపీతో కలిసిపోయిందన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు.
జేపీ నడ్డా లాంటి వ్యక్తిని ప్రభావితం చేసే పరిస్థితుల్లో పురంధేశ్వరి, చంద్రబాబు లేరు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బట్టలు చింపుకున్నారు. టీడీపీతో బీజేపీ కలవకూడదని వైసీపీ ప్లాన్. కలిస్తే తమ అధికారం పోతుందన్న భయం. బీజేపీ చిన్న పార్టీనా? టీడీపీ ఏం చెబితే అది వింటారా? టీడీపీ, బీజేపీ కలయికపై ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారం.. ఇండియా టుడే సర్వే వివరాలపై ఆంధ్రాలో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వైనంపై..
‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
