ABN RK- Chandrababu: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఆంధ్రజ్యోతి ఆర్కే
చంద్రబాబు నాయుడు తెలుసు కదా! 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ తెలుసు కదా.. చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తే జర్నలిస్ట్. అలాంటి వ్యక్తి చెందిన పత్రికలో చంద్రబాబు గురించి ఒక వ్యతిరేక వార్త వస్తే అది ప్రకృతి విరుద్ధమైనదే కదా.

ABN RK- Chandrababu: సూర్యుడు పడమరన ఉదయిస్తే ఎలా ఉంటుంది? చక్కరను నోట్లో వేసుకుంటే చేదు రుచి కలిగితే ఎలా అనిపిస్తుంది? కర్పూరాన్ని వెలిగిస్తే మంటకు బదులు నీరు వస్తే ఎలా ఉంటుంది? ఇదేంటి ఇలా ప్రకృతి విరుద్ధమైన విషయాలు చెబుతున్నారు? అనే కదా మీ సందేహం.. ఇలాంటి ప్రకృతి విరుద్ధమైన వార్త చూసిన తర్వాత అలాంటివే స్ఫురణలోకి వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందయ్యా అంటే..
చంద్రబాబు నాయుడు తెలుసు కదా! 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ తెలుసు కదా.. చంద్రబాబు అడుగులకు మడుగులు వత్తే జర్నలిస్ట్. అలాంటి వ్యక్తి చెందిన పత్రికలో చంద్రబాబు గురించి ఒక వ్యతిరేక వార్త వస్తే అది ప్రకృతి విరుద్ధమైనదే కదా. పైగా సాక్షిలాంటి మీడియాలో కనిపించని ఆ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపిస్తే అది ఒక వింతే కదా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే అమరావతి రాజధాని సంబంధించి ప్రముఖ కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నారనేది ప్రధాన అభియోగం. అమరావతి కాంట్రాక్టర్లైన షాపూర్జి పల్లోంజీ, ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టర్ల ద్వారా 2018 కోట్ల ముడుపులు అందాయి అనేది ఆరోపణగా జాతీయపత్రికలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. షాపూర్ జి పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్టు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని జాతీయ మీడియా రాసుకొచ్చింది.
అయితే సాధారణంగా ఇలాంటి వార్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా రాసే సాక్షిలో కనిపించడం సర్వసాధారణం. అసలు ఆ మీడియా సంస్థలో పనిచేసే విలేకరులకు తెలియదో, చంద్రబాబు ఎటువంటి తప్పు చేయడు అనుకున్నారో తెలియదు గాని మొత్తానికి ఆ వార్తను అనుకున్నంత స్థాయిలో ప్రజెంట్ చేయలేకపోయారు. ఇదే వార్తను ఆంధ్రజ్యోతి వేసివేసినట్టే ప్రచురించింది. చంద్రబాబు నాయుడుకు నోటీసులు అందినట్టు ఒప్పుకుంది. అయితే ఈ కేసు ఇప్పటిది కాదని రాసుకొచ్చింది.. కాని ఇదే చంద్రబాబు ఎహే నాకు ఎలాంటి నోటీసులు అందలేదని దబాయించాడు. అసలు నేను సుద్దపూసని, నేను ముడుపులు తీసుకోవడం ఏంటని ఎదురు ప్రశ్నించాడు. ఐటీ అధికారులు ఎవరనుకుని తనకు నోటీసులు పంపారో తెలియదని చెప్పుకొచ్చాడు.
చివరికి ఆంధ్రజ్యోతిలో వార్త రావడంతో గొంతు సవరించుకున్నాడు. ప్రతిసారి చంద్రబాబు పల్లకి మోసి మోసి విసుగు వచ్చిందో తెలియదు గాని..వేమూరి రాధాకృష్ణ ఇలా తన ఆగ్రహాన్ని వార్త రూపంలో ప్రచురించాడు. చంద్రబాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. మరి దీనిపై టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఈ వార్తను ఈనాడు పెద్దగా పట్టించుకోలేదు. పిచ్చి గాని జగన్ కు వ్యతిరేకంగా ఏమున్నా రాసే ఈనాడు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటే ఎలా రాస్తుంది?
