ABN RK- KCR: దళిత బంధు… కెసిఆర్ తన మానస పుత్రికగా తెలంగాణ జనానికి పరిచయం చేసిన పథకం.. భారీగా నిధులు విడుదల చేస్తున్నట్టు, దళితులను ఉద్ధరించినట్టు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు.. ప్రచారాన్ని కోరుకునే వ్యక్తుల్లో కేసీఆర్ ముందు ఉంటాడు కాబట్టి.. మనం తప్పు పట్టలేం.. కానీ మొన్న కాగ్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. కేటాయింపులు బాగానే ఉన్నాయి కానీ నిధుల మంజూరు లేదని తేల్చిపడేసింది.. ఇలాంటి సమయంలో వాచ్ డాగ్ పాత్ర పోషించాల్సిన మీడియా అధికార పార్టీకి సరెండర్ అయింది.. కెసిఆర్ కు భుజకీర్తులు తొడగడంలో పోటీపడుతోంది. కానీ ఇలాంటి సమయంలో ఆంధ్రజ్యోతి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది.. ఆంధ్రజ్యోతి కూడా ఒకప్పుడు కెసిఆర్ సేవలో తరించిందే.. ఏ మాటకు ఆ మాట కొద్దో గొప్పో టెంపర్ మెంట్ ఆంధ్రజ్యోతి నుంచే ఆశించవచ్చు.

ABN RK- KCR
పత్రిక అంటే భజన కాదు. అవసరమైనప్పుడు అది కాగ్ పాత్ర పోషించాలి.. అవసరంగా మారి ఫ్యాక్ట్ ఫైండింగ్ మెకానిజంగా మారాలి.. దర్యాప్తులు చేయాలి. గూడచర్యం వంటి పాత్రను కూడా పోషించాలి.. జనం వెంట నిలవాలి.. ప్రభుత్వ పథకాల లోని డొల్లతనాన్ని, ఫాయిదా దందాను బయట పెట్టాలి.. ఇక ఈ ఆంధ్రజ్యోతి కూడా అదే పాత్ర పోషిస్తున్నది.. కెసిఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ, భ్రమాత్మక తెలంగాణ మోడల్ కే హైలెట్ అని చెబుతూ దేశవ్యాప్తంగా ఈట 25 లక్షల మందికి వర్తింప చేస్తానంటున్న దళిత బంధు ఆచరణ తీరు ఎలా ఉందో తేటతెల్లం చేసింది..
వాస్తవానికి దళిత బంధుకు సంబంధించి ఇవాల్టికి స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అప్పటికప్పుడు హుజురాబాద్లో గెలవాలి కాబట్టి పొలిటికల్ ఫాయిదా కోసం ఉద్దేశించిన పథకం అది. ఉద్యోగులకే సమయానికి జీతాలు ఇవ్వలేని దురవస్థలో… ఇక దళిత బంధుకు నిధులు ఏవి? లబ్ధి కోసం దరఖాస్తుదారులు కూడా భారత రాష్ట్ర సమితి నెలల చుట్టూ తిరగాల్సి వస్తోంది.. ఇతర పార్టీల వారికి వర్తింపజేసే పథకం కాదు ఇది. అంతంత మాత్రం అమలు జరిగే ఈ పథకానికి బడ్జెట్లో ఘనంగా 17,700 కోట్లు కేటాయించింది. ఒక రకంగా చెప్పాలంటే పేరు గొప్ప, అంకెల్లో గొప్ప, బడ్జెట్ పరిమాణంలో గొప్ప, పటాటోపంలో గొప్ప. తీరా చూస్తే ఆ కేటాయింపులో ఖర్చులు లేవు.. ఆంధ్రజ్యోతి కథన సారాంశం ఇదీ. ఇలాగే తవ్వితే కాలేశ్వరం అసలు ప్రయోజనాలు, కళ్యాణ లక్ష్మి అమలు తీరు, నిజమైన రైతుకు దక్కని రైతుబంధు, 24 గంటల సాగు కరెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు… చెప్పుకుంటూ పోతే బోలెడు… కానీ ఇతర పత్రికలు చేస్తున్నది ఏమిటి… అదిగో మహారాష్ట్రలో పాగా, ఇదిగో ఈశాన్యంలో జెండా పాతారు.. భారత రాష్ట్ర సమితి పై దేశం చూపు, చేరికలకు, విలినాలకు వెంపర్లాట అంటూ కేసిఆర్ పాదముద్రల్లో పూలు చల్లుతూ పునీతమవుతున్నాయి. ఇలాంటి కీర్తి కీర్తనలు అంతిమంగా తనకు ప్రజల్లో కౌంటర్
ప్రొడక్ట్స్ అవుతాయనే సంగతిని కెసిఆర్ ఎలా విస్మరిస్తున్నారో ఇప్పటికీ అర్థం కాని విషయం.

ABN RK- KCR
కొన్ని రాజకీయ వార్తలకు సంబంధించి ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి ఆంధ్రజ్యోతి నెరిపే పాత్రికేయం పరమ చిరాకు యవ్వారం.. కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ . ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టు పట్టిన తంతు.. కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు.. ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించిపోతోంది.. తన పథకాలను కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది.. చివరికి సాక్షి కూడా నమస్తే సాక్షి అయిపోయింది. మించి పోయింది కూడా.. చదవగలిగే వార్త ఒక్కటి కూడా లేదేమని జనం తిరస్కరిస్తుంటే పత్రికలో పనిచేసే వాళ్ళందరము తల పది పేపర్లు అమ్ముకుందామనే బృహత్ సంకల్పం తీసుకుంది. ఇంతకుమించిన విఫలం ఇంకోటి ఏముంటుంది. ఇక ఏనాడో వెన్ను వొంగిపోయిన ఈనాడు గురించి చెప్పుకోవడం ఉత్త దండగ మారి ప్రయాస. అది ఇప్పుడు నిప్పులు ఆరిపోయి కనిపిస్తున్న బూడిద వార్తల కుప్ప.. కాస్త ఈ జాబితాలో డిఫరెంట్ గా కనిపించేది ఆంధ్రజ్యోతి మాత్రమే. అందుకే ఇప్పుడు తెలంగాణలో అది కాగ్ పాత్ర పోషిస్తున్నది. అంతేకాదు మున్ముందు మరింత సినిమా చూపిస్తామని కెసిఆర్ కు హెచ్చరికలు కూడా జారీచేస్తోంది. అంటే పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్! ఇదే ఇప్పుడు కేసీఆర్ కు ఆర్కే చెబుతున్నది.