Anchor Vishnu Priya: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్… కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్!
తాజాగా బ్లాక్ కలర్ చోళీ లెహంగాలో మెస్మరైజ్ చేశారు. విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. దాంతో కుర్రాళ్ళు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. విష్ణుప్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. బుల్లితెరపై ఆమె అరుదుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో కొన్ని క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నారు. ఇటీవల విష్ణుప్రియ దయ టైటిల్ తో వెబ్ సిరీస్ చేసింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర చేయగా ఈషా రెబ్బా, జోష్ రవి కీలక పాత్రల్లో కనిపించారు. దయలో విష్ణుప్రియ జర్నలిస్ట్ పాత్ర చేసింది. ఆమెకు ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. దయ 2 సైతం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దయ సిరీస్ కి పాజిటివ్ టాక్ దక్కింది.
గత ఏడాది విష్ణుప్రియ వాంటెడ్ పండుగాడ్ చిత్రం చేశారు. అనసూయ, వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలు చేయగా… విష్ణుప్రియ కూడా నటించారు. అయితే వాంటెడ్ పండుగాడ్ నిరాశపరిచింది. సోషల్ మీడియాలో మాత్రం విష్ణుప్రియ సందడి చేస్తుంది. తరచుగా విష్ణుప్రియ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ కాకరేపుతుంటాయి.
తాజాగా బ్లాక్ కలర్ చోళీ లెహంగాలో మెస్మరైజ్ చేశారు. విష్ణుప్రియ గ్లామర్ ట్రీట్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. దాంతో కుర్రాళ్ళు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. విష్ణుప్రియ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక విష్ణుప్రియ కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం. యూట్యూబర్ గా ఆమె ప్రస్థానం మొదలైంది. పోవే పోరా షోతో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్ తో కలిసి ఈ యూత్ఫుల్ షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించింది. కెవ్వు కేక ఓ మోస్తరు విజయం అందుకుంది.
ఆ విధంగా పాపులారిటీ తెచ్చుకుని నటిగా రాణిస్తుంది. బిగ్ బాస్ షోకి వెళ్లే అవకాశం వచ్చినా విష్ణుప్రియ వదులుకున్నారని సమాచారం. ప్రతి సీజన్ కి ఆమె పేరు వినిపిస్తోంది. తీరా షోలోకి ఆమె అడుగుపెట్టడం లేదు. ఇటీవల విష్ణుప్రియ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లిగారు అకాల మరణం పొందారు. విష్ణుప్రియ తల్లి హెయిర్ డ్రెస్సర్ అట. శ్రియ శరన్, ఆర్తి అగర్వాల్ వంటి స్టార్స్ వద్ద ఆమె పని చేశారట. ఆర్థికంగా మాత్రం అమ్మ నిలదొక్కుకోలేదని విష్ణుప్రియ ఓ సందర్భంలో అన్నారు.
ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ లో అస్లీల వీడియోలు, ఫోటోలు దర్శనమిచ్చాయి. దాంతో అందరూ షాక్ అయ్యారు. నా అకౌంట్ హ్యాక్ అయ్యిందని విష్ణుప్రియ వివరణ ఇవ్వడం జరిగింది. విష్ణుప్రియ తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. కెరీర్లో ముందుకు వెళుతుంది.
View this post on Instagram
