Sreemukhi : చీరలో సింగారించుకున్న శ్రీముఖి… స్టార్ యాంకర్ క్రేజీ లుక్ వైరల్!
వర్షిణి, విష్ణు ప్రియ, దీపికా పిల్లి లాంటి వాళ్ళు శ్రీముఖికి అసలు పోటీనే కాదు. శ్రీముఖి ఈ స్థాయిలో బుల్లితెరపై రాణిస్తుందని అనుకోలేదు. గత రెండు మూడేళ్ళలో శ్రీముఖి ఫేమ్ బాగా పెరిగింది. మేకర్స్ ఆమె వెనుకపడుతున్నారు. బిగ్ బాస్ షో అనంతరం శ్రీముఖి కెరీర్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. 2019లో ప్రసారమైన సీజన్ 3లో శ్రీముఖి పాల్గొంది. తన టాలెంట్ తో ఫైనల్ కి వెళ్ళింది.

Sreemukhi : యాంకరింగ్ లో తనకు తిరుగులేదని నిరూపిస్తుంది శ్రీముఖి. బుల్లితెర మీద హవా మొత్తం అమ్మడుదే. అనతికాలంలో ఎదిగిన శ్రీముఖి టాప్ యాంకర్స్ కి పోటీ ఇస్తుంది. శ్రీముఖి ఖాతాలో అరడజను షోల వరకూ ఉన్నాయి. ఇతర యాంకర్స్ ఎవరూ ఈ స్థాయిలో షోలు చేయడం లేదు. లెజెండరీ యాంకర్ సుమ కూడా నెమ్మదించారు. ఆమె సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. ఇక రష్మీ గౌతమ్ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి పరిమితమైంది.
వర్షిణి, విష్ణు ప్రియ, దీపికా పిల్లి లాంటి వాళ్ళు శ్రీముఖికి అసలు పోటీనే కాదు. శ్రీముఖి ఈ స్థాయిలో బుల్లితెరపై రాణిస్తుందని అనుకోలేదు. గత రెండు మూడేళ్ళలో శ్రీముఖి ఫేమ్ బాగా పెరిగింది. మేకర్స్ ఆమె వెనుకపడుతున్నారు. బిగ్ బాస్ షో అనంతరం శ్రీముఖి కెరీర్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. 2019లో ప్రసారమైన సీజన్ 3లో శ్రీముఖి పాల్గొంది. తన టాలెంట్ తో ఫైనల్ కి వెళ్ళింది.
ఫైనల్ లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ కోసం పోటీపడ్డారు. రాహుల్ కి సింపతీ వర్క్ అవుట్ కావడంతో శ్రీముఖికి మైనస్ అయ్యింది. తృటిలో టైటిల్ చేజారింది. అయితే అప్పటికే పాపులారిటీ ఉన్న యాంకర్ కావడంతో నిర్వాహకులు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారని ప్రచారం జరిగింది. హౌస్ ఉంది రాగానే ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ ట్రిక్ కి వెళ్ళిపోయింది. టైటిల్ కోల్పోయినా ఫేమ్ దక్కింది. కెరీర్ లో ఎదిగేందుకు మార్గం ఏర్పడింది.
నటిగా కూడా రాణించాలనేది శ్రీముఖి కోరిక. ఆల్రెడీ చాలా చిత్రాల్లో శ్రీముఖి చిన్నా చితకా పాత్రలు చేశారు. ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అయితే ఆమె స్టార్ హీరోయిన్ పొజిషన్ పై కన్నేశారు. అందుకే ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటున్నారని సమాచారం. పేరులేని నటులు, దర్శకులతో పని చేయడం వలన ప్రయోజనం లేదని భావిస్తున్నారట. త్వరలో శ్రీముఖి నుండి బిగ్ అనౌన్స్మెంట్స్ రావచ్చంటున్నారు. హీరోయిన్ అయినా కాకున్నా శ్రీముఖి కెరీర్ కి ఢోకా లేదు. ఆమె కోట్ల సంపాదనతో సెటిల్ అయ్యారు.