Anchor Anasuya Bharadwaj: బెడ్ పై బోర్లా పడుకొని అనసూయ విరహ వేదన… కవితలు వల్లిస్తూ కవ్విస్తున్న బోల్డ్ యాంకర్
Anchor Anasuya Bharadwaj: అనసూయ ఏం చేసినా సంచలనమే. అలాంటి ఇమేజ్ ఆమె సొంతం. ఈ మధ్య అనసూయ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. సోషల్ మీడియాలో ఊహించని పోస్ట్స్ పెడుతుంది. తాజాగా అనసూయ కవిగా మారిపోయింది. తన విరహ వేదన తెలియజేస్తూ కవిత రాసింది. ఆ కవితను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అనసూయ కవితలో పదాలు, వాక్యాలు చూస్తే ఆమె ఎవరి ప్రేమలోనో మునిగి తేలుతుందని అర్థమవుతుంది. అందులో నుండి బయటపడ లేక అల్లాడుతోంది. […]

Anchor Anasuya Bharadwaj: అనసూయ ఏం చేసినా సంచలనమే. అలాంటి ఇమేజ్ ఆమె సొంతం. ఈ మధ్య అనసూయ వైఖరిలో చాలా మార్పు వచ్చింది. సోషల్ మీడియాలో ఊహించని పోస్ట్స్ పెడుతుంది. తాజాగా అనసూయ కవిగా మారిపోయింది. తన విరహ వేదన తెలియజేస్తూ కవిత రాసింది. ఆ కవితను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అనసూయ కవితలో పదాలు, వాక్యాలు చూస్తే ఆమె ఎవరి ప్రేమలోనో మునిగి తేలుతుందని అర్థమవుతుంది. అందులో నుండి బయటపడ లేక అల్లాడుతోంది. టీనేజ్ లో రావాల్సిన ఆలోచనలు, అనుభవాలు అనసూయకు ఈ వయసులో ఎందుకు కలుగుతున్నాయో అర్థం కాక.. అభిమానులు అల్లాడుతున్నారు.

Anchor Anasuya Bharadwaj
ఆయన ఎవరో అనసూయ వేదనను అర్థం చేసుకొని, విరహ వేదన నుండి బయటపడవేయమంటున్నారు అభిమానులు. అనసూయ తన కవితలో…. ‘మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా… నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న… నా మనసు తేలేదెలా… గిలిగింత పెడుతున్న… నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం…’ అంటూ ఒక లవ్ ఎమోజీ జత చేసింది. కవితకు తోడు ఆమె రొమాంటిక్ పోజ్ మరింతగా మనసులు దోచేసింది. బెడ్ పై బోర్లా పడుకొని శ్రీవారి ప్రేమ లేఖ హీరోయిన్ ని గుర్తు చేసింది.
అయితే ఇదంతా భరద్వాజ కోసమే కావచ్చు. ఆఫీస్ నుండి రావాల్సిన భర్త భరద్వాజ్ ని గుర్తు చేసుకొని ఇలా కవితలతో కాలం గడుపుతున్నట్లు ఉంది. ఇక అనసూయ పోస్ట్ మరోసారి నెటిజెన్స్ ని ఆకర్షించింది. వారు తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు. నీమనసు దోచుకున్న ఆ లక్కీ ఫెలో ఎవరని అడుగుతున్నారు. అదే సమయంలో ఆమె యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ, నెగిటివ్ కామెంట్స్ కి పాల్పడుతున్నారు.

Anchor Anasuya Bharadwaj
కాగా అనసూయ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక సినిమా స్టోరీకి మించిన డ్రామా ఆమె ప్రేమకథలో ఉంది. ఇంటర్ చదివే రోజుల్లో ఒక ఎన్ సి సి క్యాంపులో అనసూయకు భరద్వాజ్ తో పరిచయం ఏర్పడింది. చాలా గ్యాప్ తర్వాత డిగ్రీలో మరలా ఎన్ సి సి క్యాంపులో కలుసుకున్నారు. అప్పుడు ఒకరికొకరు ప్రేమను వ్యక్తీకరించుకున్నారు. అయితే అనసూయ-భరద్వాజ్ ప్రేమకు తండ్రి విలన్ లా తగిలాడు. ఆయన్ని ఎదిరించి ఏళ్లతరబడి ఎదురుచూసి అనసూయ ప్రేమను గెలిపించుకుంది. అనసూయకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
