Anasuya Bharadwaj: నన్ను గెలికారు, సింగిల్ గా మీకు చుక్కలు చూపిస్తా… అనసూయ డైరెక్టర్ వార్నింగ్!
అనసూయ సందేశం గమనిస్తే… మీరు ఏం తప్పు చేశారో తెలుసుకోవాలి. అందుకు బాధ్యత వహించాలి. అప్పటి వరకు నేను ఇలానే చేస్తాను. దీని వలన నేను హెవీ క్రిటిసిజం, నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయినా పర్లేదు. వెనకడుగు వేసేది లేదు. నేను కన్నీళ్లు పెట్టుకొని సింపతీ సంపాదించడానికి మోసగత్తెను కాదు.

Anasuya Bharadwaj: చూస్తుంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వదిలేసినా అనసూయ వదిలేలా లేదు. ఆమె రోజుకో పోస్ట్ పెడుతూ కాకపుట్టిస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. సుదీర్థ సందేశం పోస్ట్ చేసిన అనసూయ ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చినా నేను వెనక్కి తగ్గేది లేదు. మీరు చేసిన తప్పేంటో తెలుసుకునేలా చేస్తానని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.
అనసూయ సందేశం గమనిస్తే… మీరు ఏం తప్పు చేశారో తెలుసుకోవాలి. అందుకు బాధ్యత వహించాలి. అప్పటి వరకు నేను ఇలానే చేస్తాను. దీని వలన నేను హెవీ క్రిటిసిజం, నెగిటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయినా పర్లేదు. వెనకడుగు వేసేది లేదు. నేను కన్నీళ్లు పెట్టుకొని సింపతీ సంపాదించడానికి మోసగత్తెను కాదు. అలాంటి పనులు నేను చేయను. మీరు నా మీద ఎంత బురద చల్లినా, ఎంత క్రిందకు లాగినా నా పోరాటం ఆగదు.
నాకు న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉంది. ఒకరోజు నిజాలు తెలుస్తాయి. అటెన్షన్ కోసమే నేను ఇలా చేస్తున్నానని అంటున్నారు. అవును నేను అటెన్షన్ కోరుకుంటున్నాను. కానీ మీరు అనుకుంటున్నట్లు కాదు. నా వర్క్ నాకు అటెన్షన్ తెచ్చిపెడుతుంది. అలా అని నాకు పని లేక ఇలా చేస్తున్నాను అనుకోవద్దు. నాలో ఉన్న అమ్మను టార్గెట్ చేశారు. ఆమె తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సింగిల్ గానే నేనేమిటో చూపిస్తాను. మీలా డబ్బులిచ్చి జనాలను పెట్టుకోను… అని రాసుకొచ్చారు.
అనసూయ తీరు చూసిన నెటిజెన్స్ ఆమెకు ఈ వివాదాన్ని వదిలేసే ఆలోచన లేదని అంటున్నారు. నిజానికి వివాదం రాజేసింది అనసూయే. ఖుషి చిత్ర పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ పేరుకు ముందు The అని పెట్టారు. దీన్ని అనసూయ తప్పుబట్టారు. పైత్యం బాగా ఎక్కువైపోయిందని ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అది కాస్తా చిలికి చిలికి గాలివాన అవుతుంది. గతంలో కూడా అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది.
