Anasuya Bharadwaj: అంతకంతకూ చిన్నపిల్లై పోతున్న అనసూయ… గౌనులో ఎంత అందంగా ఉందో కదా!
అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె కెరీర్ మొదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదంలో ఉంటుంది.

Anasuya Bharadwaj: అనసూయ అందాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అభిమానుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అనసూయ సౌందర్యానికి చిరునామాగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూస్తే అనసూయ వయసు అంతకంతకు తగ్గుతుంది. రాను రాను మరీ చిన్నపిల్లై పోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రాక్ లో అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ”సమస్యలు అధిగమించే వరకు అవి కష్టంగా అనిపిస్తాయి. కాబట్టి పట్టు వదలకుండా పోరాడుదాం…” అంటూ ఓ కొటేషన్ కూడా జోడించింది.
అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె కెరీర్ మొదలైనప్పటి నుండి ఏదో ఒక వివాదంలో ఉంటుంది. యాంకర్ గా ఉన్నన్నాళ్ళు ఆమె డ్రెస్సింగ్ వివాదాస్పదం అయ్యింది. కుటుంబ సభ్యులు కలిసి వీక్షించే షోల్లో మితిమీరిన ఎక్స్పోజింగ్ చేస్తుందన్న విమర్శలు వినిపించాయి. వాటిని కూడా ఆమె తిప్పికొట్టారు. నా బట్టలు నా ఇష్టం. జడ్జి చేయడానికి మీరెవరు? నాకు సౌకర్యంగా అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా… అని ఆమె కుండబద్దలు కొట్టారు.
ఇక హీరో విజయ్ దేవరకొండతో కొన్నాళ్ళు వివాదం నడిచింది. విజయ్ దేవరకొండ విషయంలో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ట్వీట్స్ చేసి వివాదం రాజేసింది. అలా చేయడానికి కారణం ఉందని ఇటీవల బయటపెట్టింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి నన్ను ట్రోలింగ్ చేయించినట్లు నాకు తెలిసిందని అనసూయ పరోక్షంగా చెప్పింది. అందుకే ఆయన్ని నేను టార్గెట్ చేశాను అంది. అయితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రెస్ మీట్లో చెప్పింది.
సోషల్ మీడియాలో అనసూయ మీద నెగిటివిటీ ఎక్కువగా ఉంది. అయితే హేటర్స్ ని కవ్వించేలా ఆమె పోస్ట్స్ ఉంటాయి. ఇక నటిగా బిజీ అయిన అనసూయ పలు చిత్రాల్లో నటిస్తుంది. పుష్ప 2 లో దాక్షాయణిగా మరోసారి అలరించనుంది. పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న పెదకాపు మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
View this post on Instagram
