
Anasuya Bharadwaj
Anasuya Bharadwaj: బుల్లితెర, వెండితెర నటి అనసూయ. బుల్లితెర ఈటీవీలో జబర్దస్త్ ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం అటు వెండితెర, ఇటు బుల్లితెరను శాసిస్తోంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో బిజీగా ఉంటోంది. ఎప్పుడు తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. దీంతో అనసూయ తన సోయగాలను ఎప్పటికప్పుడు పరుస్తోంది. అందరి హృదయాలను కొల్లగొడుతోంది. మత్తెక్కించే కళ్లతో వల విసురుతోంది. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది.
వెండితెరలోనూ తనదైన ముద్ర వేస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక పుష్పలో దాక్షాయణిగా కనిపించి అలరించింది. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పుడు పుష్ప 2లోనూ ఓ మంచి పాత్ర పోషిస్తుందని పరిశ్రమ టాక్. ఇలా అనసూయ సినిమాల్లో నటిస్తూ మంచి మార్కులు తెచ్చుకుంటోంది. బుల్లితెర కన్నా వెండితెరకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన పిక్ లు పెడుతూ వస్తోంది.
అనసూయ అందాలకు చాలా మంది ఫిదా అవుతుంటారు. తన వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నెటిజన్లతో పిచ్చాపాటి మాట్లాడుతుంది. వారి అభిప్రాయాలు కూడా అడుగుతుంది. తన నటనలో ఇంకేమైనా మార్పులు చేసుకోవాలా అని అడుగుతుంది. ఇలా అనసూయ ప్రేక్షకులను తన అందాలతో ఉర్రూతలూగిస్తోంది. తాజాగా తన తొడ కనిపించేలా కారుకు ఒరిగి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఎగబడిపోరా అనే కామెంట్లు సైతం వస్తున్నాయి.

Anasuya Bharadwaj
అయినా ఎవరేమి అనుకున్నా తన దారి తనదే. తన అందాలు చూపించేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. బుల్లితెర, వెండితెరలను ఏకకాలంలో శాసిస్తోంది. చిరంజీవితో ఆచార్యలో కూడా కనిపించింది. ఇటు కొడుకు అటు తండ్రి ఇద్దరితో నటిస్తోంది. మొత్తానికి అనసూయ వెండితెరను కూడా ఊపు ఊపేస్తోందనే టాక్. జబర్దస్త్ షో ద్వారా అనసూయ ఇంతటి ప్రాచుర్యం సంపాదించుకుంది. తనకు అన్నం పెట్టింది మాత్రం మల్లెమాల సంస్థే అన్న సంగతి మరిచిపోవద్దు.