Anasuya Bharadwaj : ఫ్యామిలీతో అనసూయ వినాయక చవితి వేడుకలు.. ఫొటోలు వైరల్
యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ కుండబద్దలు కొట్టారు. ముక్కుసూటిగా మాట్లాడే అనసూయ… టీఆర్పీ స్టంట్స్ పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.

Anasuya Bharadwaj : హిందువుల ప్రధాన పండగల్లో వినాయక చవితి ఒకటి. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 18న వినాయక చవితి వేడుకలు ప్రతి ఇంట్లో చోటు చేసుకున్నాయి. గణనాథుడికి ఫలం, పత్రం, నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. యాంకర్ అనసూయ వినాయక చవితి జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ వినాయక పూజలో పాల్గొన్నారు. గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన ఫోటోలు అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
అనసూయ పండగ వేళ చుడిదార్ ధరించి ట్రెడిషనల్ గా తయారైంది. ఫలం, పత్రం సమర్పించింది. పులిహోర, ఉండ్రాళ్ళు, పాయసం వంటి వంటకాలతో పాటు స్వీట్స్ నైవేద్యంగా పెట్టారు. అనసూయ అమ్మగారు గణనాథుడి మంత్ర పఠనం చేశారు. అనసూయ కొడుకులు వినాయకుడు బొమ్మలు గీశారు. ఆ ఫోటోలు కూడా అనసూయ ఫ్యాన్స్ తో షేర్ చేశారు. ఇక అందరికీ ఇంస్టాగ్రామ్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. తిరిగి అభిమానులు ఆమెకు ఫెస్టివల్ విషెస్ చెప్పారు. ఆమె ఆకాంక్షలు నెరవేరాలని కోరుకున్నారు.
మరోవైపు అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. నటిగా వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన రంగమార్తాండ, విమానం చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. నెక్స్ట్ పెదకాపు 1 చిత్రంలో అలరించనున్నాను. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు మూవీలో విలేజ్ ఉమెన్ రోల్ చేశారు అనసూయ. ఆమె పాత్ర రంగస్థలం రంగమ్మత్తను పోలి ఉంది. పెదకాపు 1 సెప్టెంబర్ 29న విడుదల కానుంది.
అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి భారీ పాన్ ఇండియా మూవీ ఉంది. ఈ చిత్రంలో దాక్షాయణిగా అనసూయ డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. పుష్ప 2పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా అనసూయను వివాదాలు వెంటాడుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఆమెకు సుదీర్ఘ కాలంగా రైవల్రీ నడుస్తుంది. విమానం చిత్ర ప్రమోషన్స్ లో దీనికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అనసూయ చెప్పడం విశేషం.
యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ కుండబద్దలు కొట్టారు. ముక్కుసూటిగా మాట్లాడే అనసూయ… టీఆర్పీ స్టంట్స్ పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.
