Anasuya Bharadwaj: కమెడియన్ తో బెడ్ పై దొరికిన అనసూయ.. వైరల్ వీడియో
ఆమె గట్స్ ఏమిటో చెప్పేందుకు తాజా మూవీ నిదర్శనంగా నిలిచింది. అనసూయ కీలక రోల్ చేసిన విమానం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.

Anasuya Bharadwaj: అనసూయ గట్స్ గురించి తెలిసిందే. ఆమె స్ట్రాంగ్ ఉమెన్. ఎవడైతే నాకేంటి అనే రకం. మై లైఫ్ మై రూల్స్ అన్నట్లు ప్రవర్తిస్తుంది. పెళ్ళై పిల్లలు ఉన్నా బీభత్సమైన గ్లామర్ షో చేస్తుంది. అదంతా తన వృత్తిలో భాగం అంటుంది. అనసూయ బుల్లితెర యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్.తెలుగు యాంకర్స్ పొట్టి బట్టలు ధరించే సంప్రదాయం ఆమెతోనే మొదలైంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ లెక్క చేయలేదు. పైగా నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా… మీరెవరు నాకు చెప్పడానికి అంటుంది. ఈ విషయంలో తనను ఎవరు విమర్శించినా అనసూయ ఒప్పుకోదు.
ఆమె గట్స్ ఏమిటో చెప్పేందుకు తాజా మూవీ నిదర్శనంగా నిలిచింది. అనసూయ కీలక రోల్ చేసిన విమానం మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేసింది. దశాబ్దాలుగా వేశ్య పాత్రపై వ్యతిరేకత ఉంది. ఆ పాత్ర చేసే హీరోయిన్స్ గురించి పరిశ్రమ ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంది. చెప్పాలంటే కొంచెం చిన్న చూపు కూడా ఉంటుంది. ఇక బెడ్ రూమ్ సన్నివేశాలు, స్కిన్ షో కామన్. అందుకే రెమ్యూనరేషన్ దండిగా ఇస్తామన్నా చేయరు.
పరిశ్రమలో అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రలు చేశారు. ఆ లిస్ట్ లో అనసూయ చేరింది. విమానం మూవీలో అనసూయ ఆ బోల్డ్ రోల్ లో కనిపించనున్నారు. విమానం మూవీ నుండి ‘సుమతి’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఆ సాంగ్ అనసూయపై తెరకెక్కింది. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేస్తూ ఏకాకి జీవితం గడుపుతున్న మహిళగా అనసూయ పాత్ర ఉండనుంది.
రాహుల్ రామకృష్ణతో అనసూయకు బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయనిపిస్తోంది. సుమతి అందాలు దూరం నుండి ఆశపడే రాహుల్ రామకృష్ణ ఒక రోజు విటుడిగా ఆమె వద్దకు వెళతాడు. సుమతి సాంగ్ లో అనసూయ-రాహుల్ మధ్య బెడ్ రూమ్ సన్నివేశం ఉన్నట్లు చూపించారు. మొత్తంగా అనసూయ ఏకంగా వేశ్య పాత్ర చేసి తానేమిటో నిరూపించుకుంది. విమానం మూవీకి శివ ప్రసాద్ దర్శకుడు. సముద్ర ఖని మరో కీలక రోల్ చేశాడు.
View this post on Instagram