Anchor Anasuya Bharadwaj : అనసూయ అసలు తగ్గడం లేదు. మనసులో ఉన్నది ఏదైనా బయటకు కక్కేస్తుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆమె ఓ ఇండైరెక్ట్ కోట్ షేర్ చేశారు. ”కొందరు సమస్య వారే సృష్టించి బాధితుల్లా నటిస్తుంటారు’ ఇది వింటుంటే నాకు వాళ్లే గుర్తుకు వస్తున్నారు” అని అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టారు. ఒకరిని సమస్యలోకి నెట్టిన వారే. తిరిగి మళ్ళీ ఏమీ తెలియనట్లు అమాయకంగా మేము నష్టపోయామని నటిస్తూ ఉంటారని అనసూయ అభిప్రాయ పడ్డారు.
ఇది వింటుంటే వాళ్లే గుర్తొస్తున్నారని చెప్పడం ద్వారా పరోక్షంగా ఆమె కొందరికి చురకలు వేసింది. వారిని మోసపూరిత వ్యక్తులు అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ వేసింది. ఈ కోట్ చూస్తే ఆమె నెటిజెన్స్ లేదా ట్రోలర్స్ ని టార్గెట్ చేసినట్లు లేదు. పరిశ్రమకు చెందిన వారికే ఈ ఇండైరెక్ట్ కౌంటర్ వేసినట్లు అనిపిస్తుంది. ఆమె ఉద్దేశం ఏదైనా కానీ… ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది.
మరోవైపు అనసూయ ట్రోలర్స్ ని వదిలే ప్రసక్తే లేదంటుంది. ఇటీవల అనసూయ ఫిర్యాదుతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా వీర్రాజు అనే వ్యక్తి అనసూయతో పాటు బుల్లితెర సెలబ్రిటీలపై ట్రోల్స్ కి పాల్పడుతున్నాడు. అసభ్యకర కామెంట్స్, పోస్ట్స్ పెడుతున్నట్లు గుర్తించిన అనసూయ ఆధారాలతో సహా అతడిపై కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు వీర్రాజును అరెస్ట్ చేసి పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీర్రాజు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
చాలా కాలంగా అనసూయ సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ తరచుగా విమర్శలకు గురవుతుంది. ఇక లైగర్ వివాదం తర్వాత అనసూయపై సోషల్ మీడియా దాడులు ఎక్కువయ్యాయి. ఆమెను ఆంటీ అంటూ వేధిస్తున్నారు. మితిమీరి ట్రోల్స్ కి పాల్పడుతున్న వారిపై అనసూయ చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేస్తున్నారు. ఇక యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటిగా కొనసాగుతున్నారు. ఆమెను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ తో పాటు రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె చేతిలో పలు సిరీస్లు, వెబ్ మూవీస్ ఉన్నట్లు సమాచారం.