Anasuya Bharadwaj: మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని నాకు తెలుసు… పెళ్లి రోజు అనసూయ షాకింగ్ కామెంట్స్
ఒక్కోసారి నన్ను భరించే నీ సహనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరినొకరం అర్థం చేసుకొని ఎదుగుతున్నాము. మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని తెలుసు. కానీ కష్టనష్టాల్లో ఒకరికొకరం తోడు ఉంటున్నాము. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చింది. అనసూయ సందేశం భర్త మీద ఆమెకున్న ప్రేమను తెలియజేస్తుంది.

Anasuya Bharadwaj: అనసూయ పెళ్లిరోజు నాడు భర్తపై ఎనలేని ప్రేమను చూపించింది. ఆయన పట్ల తనకున్న ఆరాధన భావాన్ని వ్యక్తీకరించింది. అనసూయ సందేశం వైరల్ అవుతుంది.స్టార్ యాంకర్ అనసూయ భర్త సుశాంక్ తో వెకేషన్ కి వెళ్లారు. ఈ ట్రిప్ వెనుక ఆంతర్యం వారి మ్యారేజ్ యానివర్సరీ. పెళ్లి రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనే క్రమంలో ఇద్దరూ ఏకాంత ప్రదేశానికి చెక్కేశారు. సాగర తీరంలో చక్కర్లు కొడుతున్నారు. అనసూయ ఏకంగా బికినీ వేసింది. సుశాంక్ కి లిప్ కిస్సులతో ముంచెత్తింది. ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఇక సుశాంక్ పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ సందేశం రాసుకొచ్చింది. 2001లో నాకు నువ్వు ప్రేమ లేఖ రాశావు. దానికి అప్పుడు నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అందుకు ఇప్పుడు నీపై ప్రేమను చూపిస్తున్నాను. ఇన్నేళ్ల మన ప్రయాణంలో నీవు ఎన్నో అవమానాలు భరించావు. నిన్ను చాలా మంది అనేక మాటలు అన్నారు. అవేమీ పట్టించుకోకుండా నాపై ప్రేమను చూపుతున్నావు. ఎన్నో త్యాగాలు చేశావు.
ఒక్కోసారి నన్ను భరించే నీ సహనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరినొకరం అర్థం చేసుకొని ఎదుగుతున్నాము. మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని తెలుసు. కానీ కష్టనష్టాల్లో ఒకరికొకరం తోడు ఉంటున్నాము. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చింది. అనసూయ సందేశం భర్త మీద ఆమెకున్న ప్రేమను తెలియజేస్తుంది.
అనసూయ సుశాంక్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ ఎన్ సీసీ క్యాంపులో అనసూయ-సుశాంక్ కి పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. టీనేజ్ లో మొదలైన వీరి ప్రేమ ఏళ్ల తరబడి సాగింది. వయసుకు వచ్చాక వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే అనసూయ తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. తండ్రిని ఎదిరించి ఇంటిలో నుండి బయటకు వచ్చేసింది. కొన్నేళ్ల తర్వాత అనసూయ తండ్రి కరిగి ప్రేమ వివాహానికి ఒప్పుకున్నాడట. ఆ విధంగా సుశాంక్-అనసూయ పెళ్లి బంధంలో అడుగుపెట్టారు.
View this post on Instagram
