Anasuya Bharadwaj: ‘కన్యాశుల్కం’ సిరీస్ లో నటిస్తోన్న అనసూయ.. ఏ పాత్రనో తెలిస్తే షాకవుతారు..
జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అనసూయ భరద్వాజ్ టీవీ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సమయంలో అనసూయ చేసిన యాంకరింగ్ కు చాలా మంది ఫిదా అయ్యారు.

Anasuya Bharadwaj: సినిమాల్లో అవకాశాలు తగ్గాక చాలా మంది బుల్లితెర బాట పడుతున్నారు. సీరియళ్లు, టీవీ షోల ద్వారా తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. కానీ కొందరు టీవీల్లో యాంకర్ గా అదరగొట్టిన భామలు సినిమాల్లో జోరు పెంచారు. హీరోయిన్లుగా, సహాయ నటులుగా అలరిస్తున్నారు. అయితే అందరికీ ఆ అదృష్టం వరించలేదు. కొందరికి మాత్రమే లక్ వరించింది. అలాంటి వారిలో అనసూయ ఒకరు. అనసూయ పేరు ఇప్పుడు ఇండస్ట్రీ వైజ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఈమె స్టార్ హీరోయిన్ కాకున్న ఆ రేంజ్ లో నటిస్తూ.. అందంతో అలరిస్తూ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్లకు లేని అవకాశాలు ఇప్పుడు అనసూయకు ఉన్నాయి. ఇటీవల ‘రంగమార్తాండ’ సినిమాలో అదరగొట్టిన అనసూయ ఇప్పుడు మరో వెబ్ సీరీస్ తో బిజీగా మారింది. ఆ సిరీస్ కు సంబంధించి ఓ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. అలా ఎందుకు కనిపించిందో చూద్దాం.
జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా అనసూయ భరద్వాజ్ టీవీ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సమయంలో అనసూయ చేసిన యాంకరింగ్ కు చాలా మంది ఫిదా అయ్యారు. సినిమాల్లోకి వస్తే బాగుండు.. అని కొంత మంది పెట్టిన కామెంట్ తో అనసూయ సినిమాల్లో ట్రై చేశారు. మొదట్లో కొన్ని సినిమాల్లో సైడ్ కు కనిపించిన అనసూయను ఎవరూ పట్టించుకోలేదు. కానీ జబర్దస్త్ లో సక్సెస్ అయిన తరువాత అనసూయకు సినిమాల్లో మెయిన్ రోల్ ఇచ్చారు. ‘రంగస్థలం’, ‘గూఢచారి’వంటి సినిమాల్లో అమెకు ప్రాధాన్యం ఇవ్వడంతో అనసూయకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ తరువాత అనసూయ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు స్టార్ నటిగా గుర్తింపు వచ్చింది. అనసూయ కోసం ప్రత్యేకంగా స్టోరీని సృష్టిస్తున్నారు. లేటేస్టుగా ఆమె ‘రంగమార్తాండ’ మూవీలో నటించి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆ మూవీ గురించి పలు ఆసక్తి విషయాలు చెప్పింది. నా జీవితంలో ఇలాంటి సినిమాలో మళ్లీ చేయలేనని తెలిపింది. ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ణ వంశీకి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పింది.
తాజాగా అనసూయ హాట్ ఫోజుతో ఓ ఫొటో రిలీజ్ చేసింది. ఈ పిక్ ఎందులోదబ్బా? అని నెటిజన్లు ఆరాతీస్తున్న సమయంలో అసలు విషయం బయటపడింది. ఈ భామ లేటేస్టుగా ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో అనసూయది వేశ్య పాత్ర. గుజజాడ అప్పరావు నాటి కాలంలో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్ ను తీస్తున్నారు. ఇందులో అనసూయ పర్ఫామెన్స్ హాట్ గా ఉంటుందని అంటున్నారు. అందులో భాగంగానే ఓ హాట్ లుక్ లో ఫోజిచ్చిందని చెబుతున్నారు.
ఇవేకాకుండా అనసూయకు మలయాళం నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ కు లేని ఆఫర్లు అనసూయ సొంతం చేసుకోవడంపై ఇండస్ట్రీలో ఈమె గురించే చర్చించుకుంటున్నారు. ఇక అనసూయ పుష్ప 1 లో విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పడు దాని పార్ట్ 2లోనూ కనిపిస్తోంది. మరి ఇందులో ఏ విధంగా తన పర్ఫామెన్స్ చూపిస్తుందోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
