Anasuya Bharadwaj : చీర తీసేసి జాకెట్ లో అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అనసూయ.. వైరల్ ఫొటోలు
అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస చిత్రాలు చేస్తుంది. ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేసింది.

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ టాలెంట్ ని పరిశ్రమ కొంచెం లేటుగా గుర్తించింది. లేదంటే టాలీవుడ్ కి ఓ హాట్ హీరోయిన్ దొరికేది. ఆ రేంజ్ గ్లామర్ ఆమె సొంతం. నాలుగు పదుల వయసు దగ్గరపడినా ఆమెలోని పరువాల పదును తగ్గలేదు. చెప్పాలంటే అంతకంతకూ మెరుగు దిద్దుకుంటుంది. సహజంగా సంక్రమించిన అందాలను అనసూయ దాచుకోకుండా చూపించేస్తుంది. తాజాగా చీరలో అనసూయ పోయిన హొయలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆమె గ్లామర్ యాంగిల్ తట్టుకోలేక కుర్రాళ్లు కుదేలు అవుతున్నారు.
చీర కొంగు జార్చి పరువాలు ప్రదర్శన చేసింది. అనసూయ బోల్డ్ లుక్ వైరల్ అవుతుంది. సదరు ఫోటోలకు అనసూయ సుదీర్ఘ కామెంట్ పోస్ట్ చేసింది. ఎవరు ఏమనుకున్నా నా జీవితం నాది. నేను నాలానే ఉంటాను అనే అర్థంలో ఓ కామెంట్ పోస్ట్ చేసింది. అనసూయ బోల్డ్ యాటిట్యూడ్ కి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు.
అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస చిత్రాలు చేస్తుంది. ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో కీలక రోల్స్ చేసింది. ప్రతి సినిమాలో ఆమెకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం విశేషం. విమానం మూవీలో వేశ్య పాత్ర చేసి షాక్ ఇచ్చింది. బోల్డ్ రోల్ లో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రేమ విమానం చిత్రంలో ఎమోషనల్ పాత్రలో గుండెలు తాకింది.
విలక్షణ పాత్రలు చేస్తూ తన మార్క్ సెట్ చేస్తుంది. నెక్స్ట్ పుష్ప 2 మూవీలో దాక్షాయణిగా మరోసారి రచ్చ చేయనుంది. పుష్ప 2లో అనసూయ పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుందట. ప్రధాన పాత్రలతో ఆమె కాంబినేషన్ సీన్స్ ఉంటాయట. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. పూర్తిగా యాంకరింగ్ మానేసిన అనసూయ నటన మీద దృష్టి పెట్టింది. తన ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ కాకూడదనే యాంకరింగ్ మానేసినట్లు అనసూయ చెప్పారు. జబర్దస్త్ షో అనసూయ ఫేట్ మార్చేసింది.
