Anasuya Bharadwaj: బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ. తను మాట్లాడినా.. చిలిపిగా నవ్వినా అలా చూడాలని అనిపిస్తుంటుంది. అంతటి అందం, అణుకువ, అమాయకత్వం కలగలిసిన ఫేస్ ఉంది కాబట్టి అటు బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైన కూడా ఊపేస్తోంది. సినిమాల్లో అవకాశాలతో చెలరేగిపోతోంది.

Anasuya Bharadwaj
ఇటీవలే జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పిన ఈ సుందరాంగి ఇప్పుడు మాటీవీలో ‘పాటల’ ప్రోగ్రాంలతోపాటు పలు షోలను చేస్తోంది. బయట సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ బిజిబిజిగా గడుపుతోంది. జబర్ధస్త్ కు వీడ్కోలు పలికాక స్టార్ మాలో కీలక పాత్ర పోషిస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలిసి ‘సూపర్ సింగర్ షో’లో సందడి చేస్తోంది.
Also Read: Anupam kher- Ravi Teja: రవితేజ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత.. ఈసారైనా హిట్ కొడుతాడా?
సూపర్ సింగర్స్ తాజాగా ఎపిసోడ్ లో తనలోని ఒక కొత్త టాలెంట్ ను బయటపెట్టి అనసూయ ఫిదా చేసింది. ఆమెలోని గానామృతాన్ని పంచిపెట్టింది. అనసూయ స్వీట్ గా, క్యూట్ గా పాడిన పాట చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
జడ్జి, ప్రముఖ గాయకుడు ‘మనో’తో కలిసి తాజాగా ఓ సరసమైన ఫాట పాడింది. ఈ రోమాంటిక్ పాటను అంతే హాట్ గా పాడి అందరికీ సెగలు పుట్టించింది. ‘సరసాలు చాలు శ్రీవారు’ అంటూ సాగిన ఈ రోమాంటిక్ పాట.. అనసూయ నోట వచ్చేసరికి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని ఆమె పాడిన పాట వీడియోను షేర్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.

Anasuya Bharadwaj
లంగాఓణీ వేసుకొని అనసూయ పాడిన ఈ పాట ఇప్పుడు సూపర్ సింగర్స్ షోలోనే హైలెట్ గా నిలిచింది. ఈ పాటను చూసి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అనసూయ క్రేజ్ ను స్టార్ మా సాంతం వాడుకుంటోంది.ఆమెకు జబర్ధస్త్ కంటే ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేయిస్తూ కార్యక్రమాలను పాపులర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇక అనసూయ సినిమాల్లోనూ బిజీగా మారింది. ఇటీవలే ‘దర్జా’ సినిమా షూటింగ్ పూర్తి చేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా కూడా పూర్తి చేసింది. సుకుమార్ పుష్ప2లోనూ కీరోల్ పోషిస్తోంది.
Also Read:Sita Ramam Movie Review: సీతారామం రివ్యూ: యుద్ధాన్ని గెలిచిన ప్రేమ కథ