Anasuya Bharadwaj: విదేశీ వీధుల్లో అనసూయ కిరాక్ ఫోజులు… ఇంకా కొంచెం అంటూ కొంటె కామెంట్స్
బ్లూ జీన్స్ అండ్ ఆఫ్ టాప్ లో మెరిసిపోతున్న అనసూయ వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తూ ” ఈ ఉదయం మంచి వైబ్స్ అందిస్తుంది.

Anasuya Bharadwaj: ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూఎస్ లో ఎంజాయ్ చేస్తున్న అందాల భామ అనసూయ, ఆమె ట్రిప్ కి సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గత కొద్ది రోజులుగా సినిమాలకు, టీవీ షో లకు గ్యాప్ ఇచ్చిన అనసూయ తన ఫ్యామిలీ తో కలిసి లాంగ్ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్లూ జీన్స్ అండ్ ఆఫ్ టాప్ లో మెరిసిపోతున్న అనసూయ వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తూ ” ఈ ఉదయం మంచి వైబ్స్ అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరూ చెప్పవచ్చు సోమవారం అంటే బ్లూస్ కాదు.. స్కై బ్లూస్ మాత్రమే” అంటూ లవ్ ఎమోజి ని జత చేసి పోస్ట్ చేసింది. గతంలో కాలిఫోర్నియా లో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ , ఘిరాడెల్లి స్క్వేర్ వద్ద తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలు పాటుగా కుటుంబంతో ఎక్కువ సమయం కలిసి ఉండటం ఉత్తమం అనే అర్థం వచ్చేలా కామెంట్ పెట్టి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన అనసూయ అభిమానులు నైస్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ ఎంజాయ్ ది ట్రిప్ అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా అప్లోడ్ చేసిన ఫోటోలు చూసిన అనసూయ ఫ్యాన్స్ నీ అందానికి సలామ్ అంటూ కొందరు పోస్ట్ చేస్తుంటే, మరికొందరు ఏమో అక్క ఎన్ని రోజులు అక్క మీ ట్రిప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు మాత్రం అనసూయ ను ట్రోల్ల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఎప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసిన కానీ ఇలాంటి ట్రోల్స్ సహజమే. ఒక దశలో ట్రోలర్స్ మీద విరుచుకుపడ్డ అనసూయ ఆ తర్వాత వీళ్ళతో ఎందుకు అనుకోని పట్టించుకోవడం మానేసింది.
ఇక అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 1 లో ఆమె పాత్రకు మంచి అప్లాజ్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే విధంగా మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది అనసూయ. ఇక తనకు పుట్టిల్లు లాంటి బుల్లితెరకు దూరం కాకుండా అప్పుడప్పుడు కొన్ని షో ల్లో జడ్జిగా అలరిస్తుంది ఒకప్పటి జబర్దస్త్ హాట్ బ్యూటీ అనసూయ.
View this post on Instagram
