Anasuya Vs Vijay Devarakonda Fans: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇచ్చిన అనసూయ.. అసలేంటి వివాదం
స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవల్లో హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన లైగర్ మూవీ డిజాస్టర్ గా మిగిల్చినా ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు.

Anasuya Vs Vijay Devarakonda Fans: సినిమా నటి అనసూయ గురించి తెలియని ఆడియన్స్ లేరు. యాంకర్ గా, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నఈ భామ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీకి హీరోయిన్ లెవల్లో పాపులారి ఉందంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో తక్కువగా కనిపించే అనసూయ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక పోస్టు పెట్టి నెటిజన్లతో చిట్ చాట్ చేస్తుంటారు. ఇటీవల ఈ భామ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై వివాదాస్పద ట్వీట్ చేశారు. దీనికి ఫ్యాన్స్ పలు రకాలుగా రియాక్టయ్యారు. ఫ్యాన్స్ అలా స్పందించడంపై అనసూయ మరో సంచలన పోస్టు పెట్టారు. ఆమె చేసిన మెసెజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవల్లో హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన లైగర్ మూవీ డిజాస్టర్ గా మిగిల్చినా ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు. విజయ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నామని చాలా మంది సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు పెడుతున్నారు. ఇంతటీ పాపులారిటీ సాధించిన విజయ్ పై ఎవరైనా కామెంట్స్ చేస్తే ఫ్యాన్స్ వెంటనే రియాక్టవుతున్నారు. ఈ క్రమంలో నటి అనసూయ విజయ్ ని ఉద్దేశించిన సంచలన పోస్టు పెట్టారు.
విజయ్ నటించిన ‘ఖుషీ’ సినిమాకు సంబంధించిన లేటేస్ట్ పోస్టర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ‘ది విజయ్’ అని ఉంది. సాధారణంగా ది అనే పదాన్ని ప్రముఖ ప్రదేశాలు, వస్తువులకు ఉపయోగిస్తారు. అయితే మనుషులకు కూడా ది అని పెట్టడంపై అనసూయ రియాక్టయ్యారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ‘ఇప్పుడే ఒకటి చూశాను. ది నా.. బాబోయ్ పైత్యం ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం..’ అంటూ మెసేజ్ పెట్టడం సంచలనంగా మారింది.
అనసూయ చేసిన ఈ మెసేజ్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చసాగింది. విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఇతర నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేశారు. కొందరు బూతులు కూడా తిట్టారు. దీంతో వీరు చేసిన పోస్టులపై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె మరో ట్విట్ చేసి సంచలనంగా మారారు. ఈ సందర్భంగా ఆమె ‘ఒక పోస్టు కోసం ఇంతమంది వత్తాసు పలకడం అంటే నమ్మలేకపోతున్నా.. అతడు సినిమాలో బుజ్జిని పార్థు అడిగినట్లు ఇంతమంది నాకోసం ఏమో బాబు…నాకేమో ఈ ఫీఆర్ స్టంట్లు తెలియవు. వాటి అవసరం కూడా రానీయను’ అంటూ మెసేజ్ పెట్టారు. అయితే అనసూయ చేసిన ఈ పోస్టుపై నెటిజన్లు మరోసారి రియాక్టయ్యారు. కొందరు అతడు సినిమయాలోని ఆ వీడియో లు పెట్టి సందడి చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ లెవల్లో బిజీగా ఉండే అనసూయ ప్రస్తుతం చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఆమె ఇటీవల నటించిన రంగమార్తండ మూవీ అనుకున్న లెవల్లో సక్సెస్ కాకపోయినా అందులో తన నటనకు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మరికొన్ని సినిమాల్లో అనసూయ కనిపించనుంది. ఈ తరుణంలో ఆమె సోషల్ మీడియాలోనూ ట్రెండీగా కావడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
