Anasuya Bharadwaj Bride: పెళ్లి కూతురుగా అనసూయ…. అప్పట్లో ఎలా ఉందో చూశారా?
అనసూయ చాలా కాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికి అనసూయ ఇంకా సెటిల్ కాలేదు. ఆమెకు ఎలాంటి ఫేమ్ లేదు. ప్రేమించినవాడి కోసం పెద్దలను ఎదిరించి నిలిచింది. ఏళ్ల తరబడి పోరాటం చేసి సుశాంక్ భరద్వాజ్ ని భర్తగా తెచ్చుకుంది. అనసూయ పెద్ద కొడుకు వయసు 13 ఏళ్ళు అట. దశాబ్దన్నర క్రితమే అనసూయ వివాహం చేసుకుందన్నమాట.

Anasuya Bharadwaj Bride: స్టార్ యాంకర్ అనసూయ వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె పాతికేళ్ల ప్రాయంలోనే పెళ్లి చేసుకుంది. నిజానికి అమ్మాయిల విషయంలో పాతికేళ్ళు కూడా ఏజ్ బార్ కింద లెక్కే. అయితే ట్రెండ్ మారింది. కనీసం ముప్పై ఏళ్లు రానిదే అమ్మాయిలు కూడా పెళ్లి అనడం లేదు. ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న హీరోయిన్స్, యాంకర్స్, మోడల్స్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అది 35 కావచ్చు 40 కూడా కావచ్చు. పెళ్లికి తొందరేముంది. అసలు చేసుకోవాల్సిన అవసరం ఏముందీ? అంటారు. అనసూయ మాత్రం వీరికి భిన్నం.
అనసూయ చాలా కాలం క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికి అనసూయ ఇంకా సెటిల్ కాలేదు. ఆమెకు ఎలాంటి ఫేమ్ లేదు. ప్రేమించినవాడి కోసం పెద్దలను ఎదిరించి నిలిచింది. ఏళ్ల తరబడి పోరాటం చేసి సుశాంక్ భరద్వాజ్ ని భర్తగా తెచ్చుకుంది. అనసూయ పెద్ద కొడుకు వయసు 13 ఏళ్ళు అట. దశాబ్దన్నర క్రితమే అనసూయ వివాహం చేసుకుందన్నమాట.
యంగ్ ఏజ్ లో అనసూయ ఫోటోలు తెరపైకి వచ్చాయి. ఆమె పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి పందిరిలో నవ వధువుగా అనసూయ మురిసిపోతుంది. ఇటీవల అనసూయ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో అభిమానులు ఆమె పెళ్లి ఫోటోలు తెరపైకి తెచ్చారు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె అభిమానులు, విరోధులు నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ-సుశాంక్ స్కూల్ డేస్ లో ఓ ఎన్ సీ సీ క్యాంపులో కలుసుకున్నారట. అలా మొదలైన పరిచయం ప్రేమగా మారిందట. 2001లో అనసూయకు సుశాంక్ ప్రేమ లేఖ రాశాడట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీరిది ఎంత ముదురు ప్రేమో. కోరి తెచ్చుకున్నవాడితో అనసూయ హ్యాపీ మారీడ్ లైఫ్ అనుభవిస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా అనసూయ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంది. తరచుగా పిల్లలు, భర్తతో పాటు విహారాలకు వెళుతుంది. ఇక నటిగా ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. వరుస చిత్రాలు చేస్తున్నారు.