‘ఫైటర్’పై మనసుపారేసుకున్న అనన్య

పూరి జగన్మాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారం ఉంది. పాన్ ఇండియా మూవీగా ‘ఫైటర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని హిందీలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా తెలుగులో పూరి జగన్మాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది. బాలీవుడ్లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ చిత్రంతో అనన్యపాండే గుర్తింపు తెచ్చుకొంది. […]

  • Written By: Neelambaram
  • Published On:
‘ఫైటర్’పై మనసుపారేసుకున్న అనన్య

పూరి జగన్మాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారం ఉంది. పాన్ ఇండియా మూవీగా ‘ఫైటర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని హిందీలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తుండగా తెలుగులో పూరి జగన్మాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది.

బాలీవుడ్లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2’ చిత్రంతో అనన్యపాండే గుర్తింపు తెచ్చుకొంది. ‘ఫైటర్’లో తొలుత విజయ్ దేవరకొండ సరసన శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే జాన్వీ కపూర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో చివరికి ఈ అవకాశం అన్యన్య పాండేకు దక్కింది. ఇటీవల ‘ఫైటర్’ షూటింగ్ పాల్గొన్న అనన్య పాండే సెట్లో సందడి చేస్తుంది. ఖాళీ సమయం దొరికితే తెలుగు పదాలను నేర్చకుంటుంది. అన్ని భాషలు నేర్చుకొని తానే డబ్బింగ్ చెప్పుకుంటానని చెబుతుందట. అలాగే ‘ఫైటర్’ మూవీలోని తన క్యారెక్టర్ పై మనసు పారేసుంది. తన నిజజీవితానికి దగ్గర ఉండే కారక్టర్లో నటించడం ఆనందంగా ఉందని సెట్స్ వచ్చిన వారితో అనన్య పాండే చెబుతుందట.

వాలంటైన్స్ డే రోజు విడుదలైన విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ మూవీ నెగిటివ్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ఆలస్యం చేయకుండా ‘ఫైటర్’ షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. ఈ మూవీ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో నటిస్తుంచనున్నట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్’ హిట్టు తర్వాత సందీప్ వంగా రణ్ బీర్ సింగ్ తో మూవీ ప్లాన్ చేశాడు. అనివార్య కారణాలతో ఈ మూవీ నుంచి రణ్ బీర్ సింగ్ తప్పుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండ ఈ మూవీ చేసేందుకు సన్నహాలు చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు